ఇంటింటికి సీపీఐ కార్యక్రమంలో దోనేపూడి శంకర్
విశాలాంధ్రవిజయవాడ: కమ్యూనిస్టు పార్టీ వందేళ్లు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా పార్టీ శ్రేణులు మరింతగా ప్రజలతో మమేకం కావాలని పార్టీ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ పిలుపునిచ్చారు. శనివారం పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ వద్ద విజయా టాక్సీ యూనియన్, విజయవాడ టాక్సీ సొసైటీ యూనియన్ సంయుక్తంగా చేపట్టిన సీపీఐ నిధి సమీకరణ కార్యక్రమాన్ని దోనేపూడి శంకర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నగరంలో టాక్సీ యూనియన్లకు విశిష్టమైన స్థానం ఉందని, సంఘ వ్యతిరేక శక్తుల ఆటగట్టించేందుకు చలసాని వెంకటరత్నం , వజ్జె సుబ్బారావుల నాయకత్వంలో ఏర్పడిన సంఘాలు ప్రజల కోసం పనిచేస్తూ తమ కుటుంబాలను పోషించుకుంటూ కమ్యూనిస్టు పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న ఎంతోమంది తమ ప్రాణాలను త్యాగం చేశారని అన్నారు. అటువంటి సంఘ సభ్యులు పెద్ద మొత్తంలో పార్టీ నిది వసూలు చేసి తమ కర్తవ్యాన్ని నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టాక్సీ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి, అబ్దుల్ కుద్దూస్, కోశాధికారి కే శ్రీనివాసరావు, కే దుర్గా శ్రీనివాస్ ,నాయకులు బోదాడ సాంబయ్య కరణం సింహాచలం మాదాసు చంటి, శ్రీ విజయ టాక్సీ సొసైటీ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు జల్ది చెన్నారావు,నూకరాజు, నాయకులు షేక్ గాలిబ్, పీతా రాజు, అబ్దుల్ గఫార్ ,ఎంవి రమణ, కూరాకుల రవి, సంగుల నాగబాబు, సీనియర్ యూనియన్ నాయకులు కంచర్ల శివయ్య తదితరులు పాల్గొన్నారు.
The post మరింతగా ప్రజలతో మమేకం కావాలి appeared first on Visalaandhra.


