మధ్యవర్తిత్వానికి సిద్ధం: చైనా


బీజింగ్: పశ్చిమాసియా ఉద్రిక్తతలకు దౌత్య పరిష్కారమే సరైనదిగా చైనా సూచన చేసింది. యుద్ధం ముగించడానికి మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధమని పేర్కొంది. సంయమనం పాటించాలని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ ఎక్స్‌లో పిలుపునిచ్చారు. యూఏఈ ఉప-ప్రధాని అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో సహా గల్ఫ్‌లోని ఉన్న రాజకీయ నాయకులతో ఫోన్‌లో తమ విదేశాంగ మంత్రి వాంగ్ యీ మాట్లాడినట్లు లిన్ వెల్లడించారు. జాతీయ భద్రతను కాపాడుకునే విషయంలో యూఏఈకి చైనా మద్దతు ఉందన్నారు. దౌత్యపరంగా సమస్య పరిష్కారానికి గల్ఫ్ దేశాలకు మద్దతు ఇస్తున్నట్లు వాంగ్ యీ అన్నారు. ‘యుద్ధం వల్ల ప్రజలు నష్టపోతారని, శాంతి కోసం చైనా నిర్మాణాత్మక పాత్ర పోషిస్తూనే ఉంటుందని విదేశాంగ శాఖ తెలిపింది. శాంతి ప్రక్రియ కోసం ప్రత్యేక రాయబారిని పంపే ప్రణాళికలను ధ్రువీకరించింది. సౌదీ అరేబియా దౌత్యవేత్త ఫైసల్ బిన్ ఫర్హాన్ అల్ సౌద్‌తో తమ ప్రతినిది మాట్లాడారని పేర్కొంది. రష్యా, ఒమన్, ఫ్రాన్స్ సహా ఇరాన్, ఇజ్రాయిల్‌తోనూ చైనా విదేశాంగ మంత్రి మాట్లాడారు.

The post మధ్యవర్తిత్వానికి సిద్ధం: చైనా appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *