-టిడిపి మండల ఇంచార్జి ధర్మవరపు మురళి
విశాలాంధ్ర-రాప్తాడు : నియోజకవర్గ కేంద్రం ప్రాప్తాడు మండలాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే పరిటాల సునీత ఆధ్వర్యంలో కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే సోదరుడు టీడీపీ మండల ఇంచార్జి ధర్మవరపు మురళీ తెలిపారు. బుధవారం మండలంలోని హంపాపురం గ్రామం నుండి చిగిచెర్ల మెయిన్ రోడ్డు వరకు, చిగిచెర్ల మెయిన్ రోడ్డు నుంచి యలమకూరు ఆంజనేయ స్వామి గుడి వరకు, బీసీ హాస్టల్ నుంచి చెత్త నుంచి సంపద కేంద్రం వరకు రూ.1. 50కోట్లతో తారు రోడ్డు, సీసీ రోడ్ల నిర్మాణానికి పీఆర్ డీఈ లక్ష్మినారాయణ, జెఈ కిషోర్, ఏపీఓ సావిత్రి, మండల కన్వీనర్ పంపు కొండప్ప, ప్రధాన కార్యదర్శి దగ్గుపాటి శీనాతో కలిసి భూమి పూజ చేశారు. అయన మాట్లాడుతూ మండలంలోని ఇంకా వేయాల్సిన రోడ్లు ఉంటే మరిన్ని నిధులు మంజూరు చేయించి నిర్మిస్తామన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధిని అటకెక్కించారని విమర్శించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ జాఫర్, సర్పంచ్ మిడతల శీనయ్య, ఫీల్డ్ అసిస్టెంట్ నంబూరి మధు చౌదరి, నాయకులు నంబూరి నాగరాజు, నంబూరి ప్రతాప్, గోనుగుంట్ల నారాయణ, చక్రపాణి, అమర్నాథ్, ధనలక్ష్మి, వాటర్ షెడ్ చైర్మన్లు యోగేంద్ర, బి.మల్లికార్జున, ఫీల్డ్ అసిస్టెంట్లు తలారి శివ, వినోద్, తదితరులు పాల్గొన్నారు.


