భూపోరాటాల యోధుడు కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు


సీఆర్, చదువుల రామయ్యలాంటి మహణీయుల స్పూర్తితో ముందుకు పోవాలి: కె రామకృష్ణ

విశాలాంధ్ర బ్యూరో – కర్నూలు : కామ్రేడ్ చండ్రరాజేశ్వరరావు పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికోసం, కష్టజీవుల కోసం అలుపెరుగని పోరాటం చేసి భూపోరాటాల యోధుడని సీపీఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ కొనియాడారు. గురువారం సీఆర్ భవన్లో కామ్రేడ్ చండ్రరాజేశ్వరరావు 32వ వర్ధంతి వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీపీఐ నగర కార్యదర్శి పీ రామకృష్ణారెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా చంద్రరాజేశ్వరరావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రామకృష్ణ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కమ్యూనిస్టు పోరాట యోధుడు సీఆర్ వర్ధంతి వేడుక దేశవ్యాప్తంగా కమ్యూనిస్టు శ్రేణులు జరుపుకుంటున్నాయన్నారు. భూస్వామ్య కుటుంబంలో పుట్టి, ఉన్నత చదువులు అభ్యసించినా ఆయన ఎప్పుడూ కార్మికులు, కర్షకుల పేదవారి అభ్యున్నతి కోసం కృషి చేస్తూ తన యావదాస్తిని త్యాగం చేశారన్నారు. జీవితాంతంగా కమ్యూనిస్టు పార్టీ నాయకులు పనిచేశారన్నారు. 100 సంవత్సరాలు పూర్తిచేసుకున్న భారత కమ్యూనిస్టుపార్టీలో సుదీర్ఘకాలం జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తి కామ్రేడ్ రాజేశ్వరరావు అన్నారు. తెలుగురాష్ట్రాల్లో ముఖ్యంగా చర్లపల్లి జమిందారు భూములకు వ్యతిరేఖంగా భూపోరాటాలు చేసి మాగాణి భూములు కూడా పంపిణీ చేయడమే కాకుండా తెలంగాణా సాయుధ పోరాటం సమయం కార్యకర్తలను ఉత్తేజపరస్తూ సాయుధపోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారన్నారు.. ఎన్నొత్యాగాలు చేసి ప్రజల హృదయాల్లో పుచ్చల పల్లిసుందరయ్య, చండ్రరాజేశ్వరరావు! మహనీయులుగా నిలిచారన్నారు. దేశవ్యాప్తంగా ఎక్కడ భూపోరాటాలు జరిగి నా ఆయన ప్రత్యక్షంగా భూపోరాటాలల్లో పాల్గొన్నారు. దేశంలో లౌకిక వాదం ఉండాలని, అన్ని మతాలు కులాలు కలసి మెలసి ఉండాలని, మతసామరస్యం ఉండాలని, చివరి వరకు పోరాటం చేశారన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్లు బాబ్రీమసీదు కూల్చడాని ప్రయత్నం చేస్తే అడ్డుకోవడానికి వెనుకాడని వ్యక్తి అటువంటి దైర్యశాలి, త్యాగధనుడు, మహోన్నతమైన వ్యక్తి సుదీర్ఘకాలం కమ్యూనిస్టుపార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి నటువంటి వ్యక్తి అని మనం గర్వంగా చెప్పుకుంటామన్నారు. చండ్రరాజేశ్వరరావు సూర్తిగా తీసుకోవాలన్నారు.. దేశంలో కష్టజీవుల రాజ్యం కోవాలి, సోషలిస్టు రాజ్యము కావాలి, దోపిడీలేని సమాజం కోసం, ఒక మనిషి మరో మనిషిని దోపిడి చేయని సమాజం కోసం పోరాటం చేసిన మహనీయుల సేవలు గుర్తించుకోవాలన్నారు. జిల్లాలో పత్తికొండలో కామ్రేడ్ చదువుల రామయ్య శతజయంతి ఉతువాలు ప్రారంభం అవుతున్నాయన్నారుకావాలి, దోపిడీలేని సమాజం కోసం, ఒక మనిషి మరో మనిషిని దోపిడి చేయని సమాజం కోసం పోరాటం చేసిన మహనీయుల సేవలు గుర్తించుకోవాలన్నారు. జిల్లాలో పత్తికొండలో కామ్రేడ్ చదువుల రామయ్య శతజయంతి ఉత్సవాలు ప్రారంభం అవుతున్నాయన్నారు. ఇలాంటి స్ఫుర్తి ప్రదాతల త్యాగధనుల సేవలను గుర్తించుకోవాలని రాబోయో రోజుల్లో మనమంతా భూపోరాటల్లో పాల్గొనాలని, ఈదేశంను కాపాడుకోవడం కోసం, లౌకిక వాదంను, రాజ్యాంగంను కాపాడుట కోసం కలసి కట్టుగా ముందుకు వచ్చిన చండ్రరాజేశ్వరరావు, చదువుల రామయ్యల సూర్తితో ముందుకు పోవాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ సీనియర్ నా జగన్నాధం, సీపీఐ జిల్లా సహాయకార్యదర్శి ఎస్ మునెప్ప, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాసులు, ఏపీ మహిళా సమాఖ్య జిల్లా అద్యక్షకార్యదర్శులు గిడ్డమ్మ నగర కార్యదర్శి భారతి, ఏఐఎస్ఎఫ్ జిల్లా అద్యక్షులు సోమన్న, సీపీఐ నగర సహాయకార్యదర్శులు డి శ్రీనివాసరావు, సీ మహేష్, నాయకులు బీసన్న, సీపీఐ నా ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *