భారీ ఊరేగింపులు, ప్రత్యేక ఘటాలు.. జొన్నాడలో అమ్మవారి జాతర సందడి..! Paiditalli Ammavari 70th Jathara showcases cultural grandeur in Jonnada. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)


Last Updated:

జొన్నాడలో పైడితల్లి అమ్మవారి 70వ జాతర భీమరావు కుటుంబీకుల ఆధ్వర్యంలో ఖరగ్‌పూర్, సోలాపూరి సంప్రదాయాలతో వైభవంగా జరిగి, గ్రామం సంస్కృతిక ఉత్సవాల్లో మునిగిపోయింది.

+

ఖరగ్‌పూర్

ఖరగ్‌పూర్ రేంజ్ లో అంగరంగ వైభవంగా పైడితల్లి అమ్మవారి జాతర 

జొన్నాడ గ్రామం భక్తి, సంస్కృతి, సంప్రదాయాల కలయికతో కళకళలాడింది. పైడితల్లి అమ్మవారి జాతరను ఈసారి భీమరావు కుటుంబీకుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించగా, గ్రామం మొత్తం ఉత్సవ వాతావరణంలో మునిగిపోయింది. ఖరగ్‌పూర్ సోలాపూరి అమ్మవారి జాతర మహోత్సవాన్ని తలపించేలా ఏర్పాట్లు చేసి, ప్రతి కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గ్రామంలో ఎక్కడ చూసినా భక్తి నినాదాలు, సంప్రదాయ వేషధారణలు, సాంస్కృతిక ప్రదర్శనలు కనిపించాయి.

విజయనగరం జిల్లా వ్యాప్తంగా పైడితల్లి అమ్మవారి జాతరకు ప్రత్యేక స్థానం ఉంది. పట్టణాలకే కాకుండా పల్లెల్లో కూడా ఈ జాతరను ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. అయితే ఈసారి జొన్నాడలో జరిగిన వేడుకలు మాత్రం ప్రత్యేకంగా నిలిచాయి. ఖరగ్‌పూర్ ప్రాంతానికి చెందిన కుటుంబాలు ఇక్కడ స్థిరపడడంతో, తమ చిన్ననాటి సంస్కృతి, సంప్రదాయాలను గ్రామస్థులతో పంచుకునేలా కార్యక్రమాలను ప్లాన్ చేశారు. మైసూర్ మాత తరహాలో ఘటాల అలంకరణ, ప్రత్యేక పూజలు నిర్వహించడం విశేషం.

ఈ జాతరలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు గ్రామస్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పొరుగు రాష్ట్రాల సంప్రదాయ కళారూపాలు, నృత్య ప్రదర్శనలు, సంగీత కార్యక్రమాలు ప్రజలను మంత్ర ముగ్ధులను చేశాయి. ఇలాంటి వేడుకలు ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదని పలువురు గ్రామ పెద్దలు చెబుతున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఉత్సాహంగా పాల్గొని జాతరకు మరింత శోభ తీసుకొచ్చారు.

ఈ ఏడాది జాతర 70వ మహోత్సవం సందర్భంగా నిర్వహించడం మరో ప్రత్యేకత. ఖరగ్‌పూర్ సోలాపూరి మాత ఆలయ ప్రాంతంలో ప్రత్యేకంగా తయారు చేసే ఘటాలను అక్కడి నుంచే తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించారు. స్థానికంగా ఈ విధమైన ఘటాల తయారీ తెలియకపోవడంతో ప్రత్యేకంగా ఆర్డర్ చేసి తెప్పించారని నిర్వాహకులు తెలిపారు. కొత్త అలంకరణలు, కొత్త విధానాలు చూసి భక్తులు ఆసక్తిగా వీక్షించారు.

భారీ ఊరేగింపుతో అమ్మవారిని గ్రామంలో ప్రదక్షిణ చేయించగా, వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఇలాంటి వైభవమైన జాతర గ్రామానికి శుభఫలితాలు తీసుకొస్తుందని స్థానికులు విశ్వసిస్తున్నారు. స్థానికులతో పాటు ఖరగ్‌పూర్ ప్రాంతానికి చెందిన కుటుంబాలు కూడా పాల్గొనడంతో ఇరు ప్రాంతాల సంస్కృతి కలిసిన మహోత్సవంగా ఈ జాతర నిలిచింది. ప్రతి ఏడాది ఇలాగే నిర్వహించాలని గ్రామస్తులు సంకల్పించారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *