భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు


గత కొంతకాలంగా కొండెక్కి కూర్చున్న బంగారం, వెండి ధరలు ఇవాళ ఊహించని రీతిలో కుప్పకూలాయి. అంతర్జాతీయ మార్కెట్లో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాల ప్రభావం దేశీయ బులియన్ మార్కెట్‌పై స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ మార్కెట్‌లో ధరలు భారీగా తగ్గడంతో జ్యువెలరీ షాపుల వద్ద సందడి మొదలైంది. 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) నిన్నటితో పోలిస్తే ఏకంగా రూ. 5,950 తగ్గి, ప్రస్తుతం రూ. 1,40,020 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 5,450 పతనమై రూ. 1,28,350 కు చేరింది. కిలో వెండి ధర ఏకంగా రూ. 20,000 తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి రూ. 2,30,000 పలుకుతోంది. మార్కెట్ నిపుణుల విశ్లేషణ ప్రకారం… అంతర్జాతీయంగా డాలర్ విలువ పెరగడం, పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో మదుపర్లు బంగారంపై పెట్టుబడులు ఉపసంహరించుకుంటున్నారు. బంగారం, వెండి ధరలు తగ్గడానికి ఇది బలమైన కారణం. మరోవైపు, ఇది పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఈ ధరల తగ్గింపు మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద ఊరట. అయితే, మార్కెట్ చాలా అస్థిరంగా ఉంది. ధరలు ఇంకా తగ్గుతాయా? లేక మళ్ళీ పుంజుకుంటాయా? అనేది అంతర్జాతీయ పరిణామాలపై ఆధారపడి ఉంటుంది.

The post భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *