– కేంద్ర విదేశాంగ శాఖ ఫ్యాక్ట్ చెక్ లో వెల్లడి
న్యూదిల్లీ : ఇరాన్ పై దాడి కోసం భారత కోర్టులను అమెరికా వినియోగించుకుంటుందని అమెరికా మాజీ అధికారి ఒకరు వ్యాఖ్యలు చేశారు. అవన్నీ నిరాధార వార్తలంటూ భారత్ తీవ్రంగా ఖండించింది. పశ్చిమాసియాలో నెలకొన్న నేపథ్యంలో సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారం ఆందోళన కలిగిస్తోంది. యూ ఎస్ ఆర్మీ మాజీ కల్నల్ డగ్లస్ మెక్ గ్రేగోర్ అమెరికా మీడియా ఛానల్ లో మాట్లాడుతూ… తమ బేస్ లు ధ్వంసం అయ్యాయని తెలిపారు. అందుచేత సమీపంలోని భారత నేవీ బేస్ లను అమెరికా వినియోగించుకోవాల్సి వస్తోందన్నారు. దీనిపై స్పందించిన భారత విదేశాంగ శాఖ ఇవన్నీ తప్పుడు, నకిలీ ఆరోపణలు మాత్రమే అని కొట్టి పారేసింది. ఇటువంటి కల్పిత, నిరాధార వ్యాఖ్యలను నమ్మొద్దని హెచ్చరించింది. హిందూ మహాసముద్రంలో ఇరాన్ యుద్ధనౌక పై దాడి జరిగిన వేల ఈ అసత్య ప్రచారం బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది. ఇరాన్ యుద్ధ నౌక ఐరిస్ దేనా -75 పై అమెరికా జలాంతర్గామితో దాడి చేసి ముంచేసిన సంగతి తెలిసినదే.
The post భారత్ పోర్టులు అమెరికా వినియోగించుకోలేదు appeared first on Visalaandhra.


