భారత్‌కు రష్యా చమురు… అమెరికా ఓకే


వాషింగ్టన్: రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకునేందుకు భారత్‌కు అమెరికా అనుమతి ఇచ్చింది. ఈ మేరకు మినహాయింపును యూఎస్ ట్రెజరీ కార్యదర్శి స్కాబ్ బెసెంట్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. భారతదేశ శుద్ధి కర్మాగారాలు రష్యా నుంచి చమురు కొనుగోలు చేసేందుకు 30 రోజుల మినహాయింపు ఇస్తున్నట్లు వెల్లడించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ప్రవాహం ఆగకుండా అమెరికా ట్రెజరీ విభాగం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 4 వరకు ఈ మినహాయింపు అమలులో ఉండనుంది. రష్యా నుంచి బయలుదేరి సముద్రంలో నిలిచిపోయిన 95 లక్షల బ్యారెళ్ల చమురును భారత్ దిగుమతి చేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ధర 83 డాలర్లు కాగా హర్మూజ్ జలసంధి గుండా రవాణా నిలిచిపోవడంతో ఇంధన కొరత ఏర్పడవచ్చు.

The post భారత్‌కు రష్యా చమురు… అమెరికా ఓకే appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *