పశ్చిమాసియా ఘర్షణల నేపథ్యంలో తగ్గిన పర్యాటకులు
దుబాయ్: పర్యాటకులు, దేశ విదేశీ పెట్టుబడిదారులతో నిన్న మొన్నటి వరకు కళకళలాడిన దుబాయ్ బోసిపోయింది. ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా మధ్య సంఘర్షణ ఈ నగరంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. చాలా ప్రాంతాల్లో షాపింగ్ మాల్‌లు, వాణిజ్య సంస్థలను మూసివేశారు. బుర్జ్ అల్ అరబ్ సహా పలు ప్రముఖ హోటళ్లు క్షిపణి దాడులకు గురవ్వడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. విమాన సర్వీసులు భారీగా రద్దవ్వడంతో పర్యాటక రంగమూ కుదేలైంది. డిమాండ్ పెంచడానికి హోటళ్లు భారీ డిస్కౌంట్లు ఇస్తున్నా స్పందన లేదు. సిటీ, స్టాండర్డ్ చార్టెర్డ్ తదితర అంతర్జాతీయ బ్యాంకులు తమ కార్యాలయాలను ఖాళీ చేశాయి. వీధుల్లో జనసంచారం కనిపించడం లేదు. జనజీవనం స్తంభించిపోయింది. పట్టణాలు కళావిహీనమైనాయి. ఎంతో సుందరమైన, సురక్షితమైన ఎడారి దేశం నేడు పర్యాటకుల రాక తగ్గడంతో కళావిహీనమైంది. వ్యాపార, నిర్మాణ రంగాలు నిలిచిపోయాయి. దుబాయ్‌లో అన్ని రంగాల్లో ఎక్కువ శాతం మంది భారతీయులే పని చేస్తున్నారు. చాలా మంది భారతీయులు స్వదేశానికి చేరుకుంటున్నారు. దుబాయ్‌లోని పారిశ్రామిక ప్రాంతాలపై ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. ఎప్ప్పుడు ఏమి జరుగుతుందోనని స్థానికులు బిక్కుబిక్కుమంటున్నారు.
The post బోసిపోయిన దుబాయ్ appeared first on Visalaandhra.


