దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డుప్లెసిస్
న్యూదిల్లీ: టీ20 ప్రపంచకప్`2026 ఫైనల్‌కు భారత జట్టు చేరడం వెనుక ఫాస్ట్ బౌలర్ బుమ్రా ఎలా దోహద పడ్డాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బుమ్రా వేసిన ప్రతి ఓవర్ టీమిండియాకు కలిసి వచ్చింది. కష్ట కాలల్లో జట్టును ఆదుకోవడం అతడికి కొత్తేం కాదు. అయితే.. తాజాగా బుమ్రా బౌలింగ్‌పై దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫ్యాప్ డుప్లెసిస్ కీలక వ్యాఖ్యలు చేశాడు. బుమ్రా టీమిండియాలో ఉండటం ఎంత అదృష్టమో భారత్‌కు అర్థం కావడం లేదన్నాడు. ఒత్తిడి సమయంలో జస్‌ప్రీత్ బుమ్రా చూపిన నియంత్రణే మ్యాచ్ ఫలితాన్ని మార్చిందని వెల్లడించాడు. జట్టుకు ఇలాంటి బౌలర్ ఉండటం అంటే కెప్టెన్‌కు అద్భుత శక్తి లభించినట్టేనన్నాడు. డుప్లెసిస్ మాటల్లో చెప్పాలంటే ‘బుమ్రా సాధారణ బౌలర్ కాదు. ఏ ఫార్మాట్ అయినా సరే, బుమ్రాకు బౌలింగ్ ఇస్తే మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పే సామర్థ్యం ఉంది. కెప్టెన్‌కు ఇది శక్తిలా మారుతుంది. బుమ్రా ఒక మాయశక్తిలా ఉంటాడు’ అని డుప్లెసిస్ సరదాగా చెప్పాడు. గురువారం ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీఫైనల్స్‌లో టీమిండియాలో ఇతర బౌలర్ల నుంచి పరుగులు భారీగా సమర్పించుకున్నప్పటికీ బుమ్రా మాత్రం కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. నాలుగు ఓవర్లలో కేవలం ముప్పై మూడు పరుగులే ఇచ్చి ఒక కీలక వికెట్ తీసుకున్నాడు. ముఖ్యంగా ఇంగ్లాండ్ లక్ష్యాన్ని ఛేదించేందుకు ప్రయత్నిస్తున్న కీలక దశల్లో బుమ్రా వేసిన ఐదవ, పదకొండవ, పదహారవ, పద్దెనిమిదవ ఓవర్లు మ్యాచ్‌ను మలుపు తిప్పాయి. ఇతర బౌలర్లపై దాడి చేసిన ఇంగ్లాండ్ బ్యాటర్లు బుమ్రా బౌలింగ్‌లో అంత సులభంగా పరుగులు తీయలేకపోయారు. బుమ్రా బౌలింగ్‌లో ఉన్న ప్రత్యేకత గురించి కూడా డుప్లెసిస్ వివరించాడు. “అతని చేతి కదలిక చాలా విభిన్నంగా ఉంటుంది. చేతి నుంచి బంతి ఎప్పుడు బయటకు వస్తుందో బ్యాటర్‌కు స్పష్టంగా అర్థం కావడం కష్టం. వేరే బౌలర్‌కు లెంగ్త్ తప్పితే భారీ షాట్‌గా మారుతుంది. కానీ… బుమ్రా విషయంలో అది అంత తేలిక కాదు. చివరిలో బుమ్రా వేసిన రెండు షార్ట్ లెంగ్త్ ఫుల్ టాస్ బాల్స్‌పై సామ్ కరన్ ఆలస్యంగా స్పందించాడు. అదే బంతిని మరొక బౌలర్ వేస్తే అది సిక్సర్ అయ్యే అవకాశమే ఎక్కువగా ఉండేది. కానీ బుమ్రా బౌలింగ్‌లో ఇది సాధ్యం కాదు.” అని వెల్లడించాడు. బుమ్రా బౌలింగ్ శైలి గురించి చెప్పేటప్పుడు డుప్లెసిస్ మరో ఆసక్తికర పోలిక కూడా చేశాడు. ఒకప్పుడు లసిత్ మలింగా ఎలా విభిన్న యాక్షన్‌తో బ్యాటర్లను ఇబ్బంది పెట్టేవాడో, బుమ్రా సైతం తన ప్రత్యేక శైలితో అదే విధంగా బ్యాటర్లకు సవాల్ విసురుతున్నాడని చెప్పాడు.
The post బూమ్రాను ఎదుర్కోవడం కష్టం appeared first on Visalaandhra.


