హైదరాబాద్: మలినేని గోపీచంద్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా భారీ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే.ఇటీవల సెట్స్ పైకి వచ్చిన ఈ సినిమా కోసం భారీ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. కాగా, ఈ చిత్రంలో హీరోయిన్స్‌గా ఇద్దరు అందాల భామల పేర్లు వినిపి స్తున్నాయి. ఈ సినిమాలో బాలయ్యకు జంటగా అందాల తార నయనతార నటించనున్నట్టుగా గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ జంటగా నటించిన సింహా, శ్రీరామరాజ్యం, జై సింహా సినిమాలు విజయం సాధించాయి. సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందనో లేక ఈ సినిమాలో పాత్రకు నయన్ అయితే సరిగ్గా సరిపోతుందనో ఆమెనే తీసుకోవాలి అనుకుంటున్నారని తెలిసింది. బాలయ్య, నయన్ జంట మరోసారి నటిస్తే బాగుంటుందని అభిమానులు కూడా కోరుకుంటు న్నారు. దాదాపుగా నయన్ ఈ సినిమాలో నటించడం ఖాయమన్న చర్చ జరుగుతోంది. తాజాగా అనుష్క పేరు కూడా వినిపిస్తోంది. బాలయ్య, అనుష్క కలిసి ఒకే ఒక్క సినిమా ‘ఒక్క మగాడు’లో నటించగా… బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడింది. ఆతర్వాత వీరిద్దరూ కలసి మరో సినిమా చేయలేదు. అయితే ఈ సినిమాలో ఉన్న ఓ పాత్రకు అనుష్క సెట్ అవు తుందని…ఈ విషయమై ఆమెని సంప్ర దించినట్లు గుసగుసలు వినిపిస్తు న్నాయి. కాగా, ఇటీవల అనుష్క పెళ్లి కుదిరిందని… ఆమె చేతిలో ఉన్న ఒక్క మలయాళం సినిమా పూర్తి చేసి పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలొచ్చాయి. ఇదే నిజమైతే… బాలయ్య సినిమాలో ఆమె నటించకపోవచ్చన్న ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో బాలయ్య సినిమాలో మరో హీరోయిన్ ఎవరు అనేది సస్పెన్స్ గా మారింది. ఈ సినిమా దసరాకి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారని తెలిసింది.


