బార్ లైసెన్స్ కోసం భారీ పోటీ.. లాటరీ ద్వారా ఎంపిక చేయనున్న ఎక్సైజ్ శాఖ..! | అనంతపురం వార్తలు (Anantapuram News)


Last Updated:

ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ అనంతపురం జిల్లాలో 2025-2028 లీజు కాలానికి బార్‌లకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తులు 24 వరకు స్వీకరించి, 25న లాటరీ ద్వారా ఎంపిక.

బార్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం….
బార్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం….

ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ తాజాగా బార్ లైసెన్సులకు సంబంధించి కీలక నోటిఫికేషన్ విడుదల చేసింది. అనంతపురం జిల్లాలో 2025–2028 లీజు కాలానికి గాను గతంలో మిగిలిపోయిన ఓపెన్ క్యాటగిరీ బార్‌లకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి రామమోహన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

ఈ నోటిఫికేషన్ ప్రకారం ఓపెన్ క్యాటగిరీలో తాడిపత్రి పట్టణంలో ఒక బార్, రాయదుర్గం పట్టణంలో మరో బార్ ఏర్పాటు చేయడానికి అనుమతి ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ రెండు బార్‌లకు సంబంధించి దరఖాస్తులు ఈ నెల 24వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు స్వీకరించనున్నట్లు వెల్లడించారు. అనంతరం 25వ తేదీ ఉదయం 8 గంటలకు లాటరీ విధానంలో లైసెన్స్ దారుల ఎంపిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

ఈ ఎంపిక ప్రక్రియను జిల్లా ఎక్సైజ్ అధికారి కార్యాలయం, విద్యుత్ నగర్‌లో నిర్వహించనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. బార్ లైసెన్స్ కోసం ప్రభుత్వం నిర్ణయించిన నాన్-రీఫండబుల్ అప్లికేషన్ ఫీజును కూడా చెల్లించాల్సి ఉంటుంది.

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కొన్ని ముఖ్యమైన పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు, పాన్ కార్డు, నివాస ధ్రువీకరణ పత్రం, ప్రతిపాదిత బార్ ప్రాంగణానికి సంబంధించిన స్థల పత్రాలు లేదా లీజ్ అగ్రిమెంట్ వంటి డాక్యుమెంట్లు తప్పనిసరిగా సమర్పించాలి. అదనంగా మున్సిపాలిటీ లేదా స్థానిక సంస్థల నుంచి క్లియరెన్స్ కూడా అవసరం ఉంటుంది.

బార్ ఏర్పాటు చేసే ప్రదేశం విషయంలో కూడా కొన్ని నిబంధనలు ఉంటాయి. ముఖ్యంగా విద్యాసంస్థలు, దేవాలయాలు, ఆసుపత్రులు వంటి ప్రాంతాల నుంచి ప్రభుత్వం నిర్ణయించిన నిర్దిష్ట దూరంలో మాత్రమే బార్ ఏర్పాటు చేయడానికి అనుమతి ఉంటుంది. అలాగే దరఖాస్తు చేసుకునే వ్యక్తి కనీసం 21 సంవత్సరాల వయస్సు నిండినవారై ఉండాలి.

మద్యం దుకాణాలు, బార్ లైసెన్సుల కేటాయింపులో సాధారణంగా భారీ పోటీ ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ పోటీని నియంత్రించడానికి ప్రభుత్వం ప్రతి దరఖాస్తుకు గణనీయమైన అప్లికేషన్ ఫీజును నిర్ణయిస్తుంది. సాధారణంగా ఇది లక్షల్లో ఉంటుంది మరియు తిరిగి ఇవ్వబడదు. ఒకే బార్ కోసం వందల సంఖ్యలో దరఖాస్తులు రావచ్చు. అలాంటి సందర్భాల్లో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో బహిరంగంగా లాటరీ డ్రా నిర్వహించి ఎంపిక చేస్తారు. లాటరీలో పేరు వచ్చిన వారికి మాత్రమే బార్ నిర్వహించే హక్కు లభిస్తుంది. అనంతరం ఎంపికైన వారు వార్షిక లైసెన్స్ ఫీజుతో పాటు ఇతర ఖర్చులు చెల్లించి బార్ నిర్వహణ ప్రారంభించాల్సి ఉంటుంది.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *