విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా):- మండల పరిధిలోని కేశేపల్లి గ్రామం సమీపంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా వద్ద రోడ్డుపై లక్ష్మీనరసింహులు అనే విద్యార్థికి మార్చి 31 న డబ్బులు దొరికాయి.
వీటిని విద్యార్థి ఉపాధ్యాయుడు శాంత్ ప్రకాష్ రెడ్డికి అందజేశారు. సమస్యను నార్పల ఎస్సై సాగర్ దృష్టికి తీసుకెళ్లడంతో, పోలీసులు పూర్తి విచారణ నిర్వహించారు. బాధితుడు జుల కాల్వ గ్రామానికి చెందిన రవీంద్రకు గురువారం పోలీస్ స్టేషన్లో ఎస్సై చేతుల మీదుగా 49000 రూపాయలు అప్పగించారు. నిజాయితీతో డబ్బు అందించిన విద్యార్థిని, సహకరించిన ఉపాధ్యాయుని పోలీసులు ప్రత్యేకంగా అభినందించారు. బాధితుడికి డబ్బుపై నిర్లక్ష్యం చూపకుండా, తీసుకెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ దేవా, ఇతర స్థానిక పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
The post బాధితులకు పోగొట్టుకున్న డబ్బులు అందజేత… appeared first on Visalaandhra.


