ఫ్రిజ్ కొనాలనుకుంటున్నారా..? సింగిల్ డోర్ & డబుల్ డోర్.. మీ ఇంటికి ఏది బెస్ట్..? Buying a Fridge in Summer Confusion Between Single Door vs Double Door. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)


Last Updated:

వేసవికాలంలో ఫ్రిజ్‌లకు డిమాండ్ పెరుగుతుంది. ఏసీ టెక్నీషియన్ ఈశ్వర్ ప్రకారం, చిన్న కుటుంబాలకు సింగిల్ డోర్, పెద్ద కుటుంబాలకు డబుల్ డోర్ ఫ్రిజ్ అనుకూలం. 3 లేదా 5 స్టార్ రేటింగ్ ఫ్రిజ్‌లు మంచివి.

+

మీ

మీ కుటుంబానికి ఏ ఫ్రిడ్జ్ కొనాలో ఎలా తెలుసుకోండి

వేసవికాలం వచ్చిందంటే ఫ్రిజ్‌లకు డిమాండ్ భారీగా పెరుగుతుంది. ఎండలు ఎక్కువగా ఉండటంతో ఆహారం తాజాగా నిల్వ చేయడానికి, చల్లని నీరు తాగడానికి ప్రతి ఇంట్లో ఫ్రిజ్ అవసరం అవుతుంది. అయితే ఫ్రిజ్ కొనేటప్పుడు చాలామంది సింగిల్ డోర్ తీసుకోవాలా లేదా డబుల్ డోర్ తీసుకోవాలా అనే సందేహంలో పడుతుంటారు. ఈ విషయంలో ముందుగా మీ కుటుంబం అవసరాలను బట్టి నిర్ణయం తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

విశాఖపట్నానికి చెందిన ఏసీ టెక్నీషియన్ ఈశ్వర్ మాట్లాడుతూ, ఇంట్లో ఎంతమంది సభ్యులు ఉన్నారో దాని ఆధారంగా ఫ్రిజ్ ఎంపిక చేసుకోవాలని తెలిపారు. ఇద్దరు సభ్యులు మాత్రమే ఉన్న కుటుంబానికి సుమారు 220 లీటర్ల సామర్థ్యం గల ఫ్రిజ్ సరిపోతుందని చెప్పారు. నలుగురు సభ్యులు ఉన్న కుటుంబానికి అయితే కనీసం 250 లీటర్ల సామర్థ్యం గల ఫ్రిజ్ తీసుకుంటే సరిపోతుందని సూచించారు.

అలాగే ఫ్రిజ్ కొనేటప్పుడు స్టార్ రేటింగ్ కూడా చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. 3 స్టార్, 4 స్టార్ లేదా 5 స్టార్ రేటింగ్ ఉన్న ఫ్రిజ్‌లను తీసుకుంటే విద్యుత్ వినియోగం తక్కువగా ఉండి కరెంట్ బిల్లు కూడా తగ్గుతుంది. ప్రస్తుతం మార్కెట్లో హైటెక్ ఫీచర్లతో కూడిన ఫ్రిజ్‌లకు ఎక్కువ డిమాండ్ ఉందని వారు తెలిపారు.

సింగిల్ డోర్ ఫ్రిజ్ చిన్న కుటుంబాలకు చాలా అనుకూలంగా ఉంటుంది. దీనికి ఎక్కువ స్థలం అవసరం ఉండదు. ధర కూడా తక్కువగా ఉండటం వల్ల చాలామంది ఈ ఫ్రిజ్‌లను కొనుగోలు చేస్తుంటారు. ప్రస్తుతం మార్కెట్లో సింగిల్ డోర్ ఫ్రిజ్‌లు 3 స్టార్, 4 స్టార్ రేటింగ్‌లలో అందుబాటులో ఉన్నాయి. అయితే పెద్ద కుటుంబం ఉన్నవారికి మాత్రం సింగిల్ డోర్ ఫ్రిజ్ సరిపోదని నిపుణులు చెబుతున్నారు.

పెద్ద కుటుంబాలకు డబుల్ డోర్ ఫ్రిజ్ మంచి ఎంపికగా ఉంటుంది. ఇందులో నిల్వ సామర్థ్యం ఎక్కువగా ఉండటంతో ఎక్కువ ఆహార పదార్థాలను సులభంగా ఉంచుకోవచ్చు. దీనికి ప్రత్యేక ఫ్రీజర్ ఉండటం వల్ల ఆహారాన్ని ఎక్కువ రోజులు సురక్షితంగా నిల్వ చేయడం సాధ్యమవుతుంది. తలుపులు కూడా పెద్దగా ఉండటంతో వాడటానికి సౌకర్యంగా ఉంటుంది.

అయితే డబుల్ డోర్ ఫ్రిజ్ కొనేటప్పుడు ఇంట్లో తగిన స్థలం ఉండాలి. అలాగే 4 స్టార్ లేదా 5 స్టార్ రేటింగ్ ఉన్న మోడల్‌ను ఎంచుకుంటే విద్యుత్ వినియోగం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఫ్రిజ్ కొనేటప్పుడు కుటుంబ పరిమాణం, స్థలం, విద్యుత్ వినియోగం వంటి అంశాలను పరిశీలించి సరైన మోడల్‌ను ఎంచుకుంటే డబ్బు కూడా ఆదా అవుతుంది, అవసరాలు కూడా పూర్తిగా నెరవేరుతాయని నిపుణులు సూచిస్తున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *