హైదరాబాద్: హను రాఘవపూడి దర్శ కత్వంలో ప్రభాస్ హీరోగా ‘ఫౌజీ’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో గుర్రపు స్వారీ సన్నివేశం చిత్రీక రిస్తుండగా గుర్రం నుంచి అదుపు తప్పి ప్రభాస్ కింద పడ్డాడు. దీంతో చేతులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ వార్త తెలియ గానే అభిమానులు ఆందోళన చెందారు. కానీ ఇది చిన్న గాయమేనని, ప్రభాస్ త్వరలోనే కోలుకుని షూటింగ్ కొనసాగిస్తా రని చిత్ర యూనిట్ తెలిపింది. దీంతో, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటనను చూపిస్తూ ఫ్యాన్స్ ట్రోలర్స్‌పై విరుచుకుపడుతున్నారు. “ప్రభాస్ డెడికేషన్ చూడండి. డూప్స్ లేకుండా రిస్కీ సీన్స్ చేస్తున్నాడు. గాయాలు వచ్చినా పట్టించుకోకుండా పని చేస్తున్నాడు. ట్రోలర్స్ ఇప్పుడు ఏం చెబుతారు?” అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ప్రభాస్ ఒకటి రెండు రోజులు విశ్రాంతి తీసుకుని తిరిగి షూటింగ్‌లో చేరనున్నాడు. ‘ఫౌజీ’తో పాటు ‘స్పిరిట’ వంటి ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసి, కొంత కాలం ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని ప్లాన్ చేస్తున్నారని సమాచారం.


