ఎంఈఓ రాజేశ్వరి దేవి
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత ప్రవేశాల కొరకు 25 శాతం కేంద్ర ప్రభుత్వం విద్యా హక్కు చట్ట ప్రకారం కల్పించిందని, ఈ అవకాశాన్ని పేద కుటుంబంలో వారు సద్వినియోగం చేసుకోవాలని ఎంఈఓ రాజేశ్వరి దేవి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇప్పటివరకు 1031 మంది మాత్రమే విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు. అంతేకాకుండా కేవలం 790 మంది మాత్రమే పాఠశాలలను ఎంపిక చేసుకోవడం జరిగిందన్నారు. రిజిస్ట్రేషన్ అనంతరం తప్పనిసరిగా లాగిన్ అయి పాఠశాలలను ప్రాధాన్యతా క్రమంలో ఎంపిక చేసి సబ్మిట్ చేయాలన్నారు. అప్పుడు మాత్రమే లాటరీలో సీటు పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 25 వరకు సమయం కలదని తెలిపారు. తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి ఇటువంటి అవకాశాన్ని మీ పిల్లల కొరకు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.


