Last Updated:
Andhra Pradesh: బైక్ పొగ వల్ల ప్రాణాలు పోవడం ఎప్పుడైనా విన్నారా? అలాంటి ఘటన మన అన్నమయ్య జిల్లాలోనే జరిగింది. ఏకంగా నలుగురి ప్రాణాలు పోవడం అంటే మామూలు విషయం కాదు. పెను విషాదం. ఏం జరిగిందో తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్.. అన్నమయ్య జిల్లా.. పుంగనూరులో ఈ విషాదం జరిగింది. ద్విచక్రవాహనం (బైక్) నుంచి వచ్చే కార్బన్ మోనాక్సైడ్ పీల్చి ఊపిరాడక ఒకే ఇంటిలో నలుగురు మృతి చెందారు. పుంగనూరు పట్టణంలోని త్యాగరాజు వీధిలో ఈ విషాద ఘటన జరిగింది. పూర్తి వివరాలు చూద్దాం.
పుంగనూరు పట్టణంలోని త్యాగరాజు వీధిలో ఓ వ్యక్తి తన బైక్ మైలేజీ తగ్గిపోవడాన్ని గమనించాడు. దాన్ని సర్వీస్ సెంటర్‌కి తీసుకెళ్తే.. వాళ్లు పరిశీలించి.. ఈ బైక్ పని అయిపోయింది. మైలేజ్ తగ్గిపోతూనే ఉంటుంది. ఇక బోర్ చేయించాల్సిందే అన్నారు. లేదంటే మాటిమాటికీ ఆగిపోతూ ఇబ్బంది పెడుతూ ఉంటుందని చెప్పారు. దాంతో అతను.. బోర్ చేయిస్తే.. మళ్లీ కొత్త బండిలా పనిచేస్తుంది అని భావించి.. చెయ్యమన్నాడు. వాళ్లు రెండ్రోజుల్లో బోర్ చేయించి ఇచ్చారు. దాంతో అతను ఆనందంగా ఇంటికి తీసుకెళ్లాడు. ఐతే.. సర్వీస్ వాళ్లు చెప్పిన ఓ విషయం.. ప్రాణాలు పోయేందుకు పరోక్ష కారణం అయ్యింది.
ప్రాణం తీసిన బైక్ పొగ
వాహనాన్ని ఇంటికి తీసుకెళ్లాక.. దాన్ని రాత్రంతా ఉంచాలి అని మెకానిక్ సూచించాడు. ఆ వ్యక్తి రాత్రి బండిని స్టార్టింగ్‌లో ఉంచాడు. తర్వాత కుటుంబం మొత్తం రాత్రి గడియ వేసుకొని నిద్రపోయింది. ఐతే.. వాళ్లు ఒక విషయం గమనించలేదు. ఆ బైక్ నుంచి రిలీజ్ అయిన పొగ మామూలు పొగ కాదు. విషపూరితమైన కార్బన్ మోనాక్సైడ్. అది ఓ క్షణం పీల్చితే.. ఏం కాదు గానీ.. ఆ ఫ్యామిలీ ఆ పొగను రాత్రంతా పీల్చినట్లైంది. బండి ఆన్‌లో ఉండటంతో.. కంటిన్యూగా దాని నుంచి పొగ.. ఇంట్లోకి వస్తూనే ఉంది. కానీ కుటుంబ సభ్యులు గాఢ నిద్రలో ఉన్నారు. తమకు తెలియకుండానే వారు ఆ పొగను పీల్చారు. నిద్రలోనే కన్నుమూశారని ప్రాథమికంగా తెలిసింది.
రామచంద్ర, వయసు 75 సంవత్సరాలు.
B. కార్తీక్, వయసు 15 సంవత్సరాలు
B. చందన, వయసు 7 సంవత్సరాలు
B. చరిత, వయసు 7 సంవత్సరాలు
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana
Mar 15, 2026 12:21 PM IST



