ప్రభుత్వ ఆసుపత్రి రోగులకు అన్నదాన కార్యక్రమం..


కన్వీనర్ నామా ప్రసాద్

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని 360 మంది రోగులకు, గర్భిణీ స్త్రీలకు ప్రత్యేకంగా స్వీట్లు కూడా ఆసుపత్రి వైద్యులు, సిస్టర్ల చేతులు మీదుగా భోజనపు ప్యాకెట్లను వాటర్ ప్యాకెట్స్ ను అందజేయడం జరిగిందని శ్రీ సత్య సాయి సేవ సమితి కన్వీనర్ నామా ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి సేవా కార్యక్రమానికి ఊరు గుండ్ల రంగనాథం వారు దాతగా సహకరించి విజయవంతం చేసినందుకు వారు సేవాసమితి తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. పుట్టపర్తి సాయిబాబా ఆశీస్సులతో గత కొన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ తీపేంద్ర నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇటువంటి సేవా కార్యక్రమాలు రోగులకు వరంలాగా మారాయని తెలుపుతూ వారు కృతజ్ఞతలను తెలియజేశారు. సేవా కార్యక్రమాలకు దాతలు ఆసక్తిగలవారు సెల్ నెంబర్ 9966047044 గాని 9030444065కు గాని సంప్రదించాలని తెలిపారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *