ప్రభుత్వ అనుమతులు లేకుండా కర్ణాటక మద్యం , నాటు సారా విక్రయించరాదు


ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ నాగ మద్దయ్య
విశాలాంధ్ర ధర్మవరం ; ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా కర్ణాటక మధ్యము కానీ నాటు సారాగాని అక్రమంగా విక్రయించరాదని అలా విక్రయిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య హెచ్చరించారు. అనంతరం
ధర్మవరం ఎక్సైజ్ స్టేషన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీ లో భాగంగా స్టేషన్ రికార్డ్స్ ను పరిశీలించారు. ఎక్సైజ్ ఏపీ సురక్ష యాప్ ద్వారా ప్రతి షాపులో ప్రతి బాటిల్ ను స్కాన్ చేసి అమ్మకాలు జరపాలి అని వారు స్పష్టం చేశారు.అదేవిధంగా తరచుగా బెల్ట్ షాపులు పై దాడులు నిర్వహించి, కేసులు నమోదు చేయాలి అని, ఎక్సైజ్ నేరములు చేసే వ్యక్తులను, పాత నేరస్థులను బైండోవర్ కేసులు నమోదు చేయాలి అని తెలిపారు. అదేవిధంగా ప్రతి షాప్ లో ఎమ్మార్పీ రెట్లను పక్కాగా అమలు చేయాలని వారు ఆదేశించారు. ఈ కార్యక్రమం లో ఎన్ఫోర్స్మెంట్ ఎక్సైజ్ సూపరిడెంట్ శ్రీరామ్ , ఎక్సైజ్ సీఐ చంద్రమని, సిబ్బంది పాల్గొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *