ప్రపంచవ్యాప్తంగా నిలిచిన ఇన్‌స్టా సేవలు.. వేలల్లో ఫిర్యాదులు


ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇవాళ‌ ఉదయం నుంచి పలు సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది వినియోగదారులు తమ డైరెక్ట్ మెసేజ్‌లు (డీఎంలు) యాక్సెస్ చేయలేకపోతున్నామని, చాట్ థీమ్‌లు మాయమయ్యాయని ఫిర్యాదులు చేస్తున్నారు. సెర్చ్ టూల్ కూడా పనిచేయడం లేదని, కాంటాక్ట్స్ కనిపించడం లేదని ఇతర సోషల్ మీడియా వేదికల ద్వారా నెటిజన్లు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.తమకు మెసేజ్‌లు ఉన్నప్పటికీ, నోటిఫికేషన్లు వస్తున్నప్పటికీ మెసేజ్‌ల పేజీ మొత్తం ఖాళీగా కనిపిస్తోందని ఒక యూజర్ పేర్కొన్నారు. ఁయాప్ మొత్తం విరిగిపోయినట్టుగా ఉందిఁ అని మరో యూజర్ పోస్ట్ చేశారు. అంతరాయాలను ట్రాక్ చేసే వెబ్‌సైట్ డౌన్‌డిటెక్టర్ ప్రకారం బుధవారం ఉదయం నాటికి 10,000కు పైగా ఫిర్యాదులు నమోదయ్యాయి. ఇందులో అమెరికా నుంచే అధికంగా ఫిర్యాదులు రాగా, భారత్‌లో కూడా వందకు పైగా కంప్లైంట్లు నమోదయ్యాయి.డౌన్‌డిటెక్టర్‌కు అందిన మొత్తం ఫిర్యాదుల్లో 71 శాతం యాప్ యాక్సెస్‌కు సంబంధించినవి కాగా, 19 శాతం సర్వర్ కనెక్షన్‌కు, 5 శాతం ఫీడ్ లేదా టైమ్‌లైన్‌కు సంబంధించిన సమస్యలని వెల్లడైంది. వినియోగదారులు సమర్పించిన ఫిర్యాదుల ఆధారంగా డౌన్‌డిటెక్టర్ సమస్య తీవ్రతను అంచనా వేస్తుంది. అందుకే సాంకేతిక సమస్యలతో ప్రభావితమైన వారి అసలు సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ అంతరాయంపై ఇన్‌స్టాగ్రామ్ యాజమాన్యం ఇంకా అధికారికంగా స్పందించలేదు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *