ప్రతి సమస్య పరిష్కారానికి గ్రీవెన్స్ డే ద్వారా న్యాయం జరుగుతుంది


ఆర్డీవో మహేష్
విశాలాంధ్ర ధర్మవరం;; ప్రతి సమస్య పరిష్కారానికి గ్రీవెన్స్ డే ద్వారా తప్పక న్యాయం జరుగుతుందని ఆర్డిఓ మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆర్‌డీవో కార్యాలయంలో పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని ప్రజలు పాల్గొని రెవెన్యూ, భూవివాదాలు , సంక్షేమ పథకాలు, ప్రాథమిక సౌకర్యాలు ,ఇతర పరిపాలనా సమస్యలకు సంబంధించిన 11 వినతి పత్రాలను స్వీకరించడం జరిగింది అన్నారు. ప్రతి వినతిని ప్రాధాన్యతగా తీసుకుని సంబంధిత శాఖల ద్వారా త్వరితగతిన పరిష్కరించబడేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పౌర సేవలను పారదర్శకంగా, వేగవంతంగా అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.స్వీకరించిన అన్ని వినతులు ఆన్‌లైన్ పిజిఆర్ఎస్ పోర్టల్ ద్వారా పర్యవేక్షించబడతాయని, ప్రజలు ప్రత్యక్ష కార్యక్రమాలతో పాటు ఆన్‌లైన్ వ్యవస్థను కూడా వినియోగించాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం డివిజన్లోని వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *