విశాలాంధ్ర-రాప్తాడు : తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ నెల 29న నిర్వహించనున్న ఆవిర్భావ వేడుకల్లో కార్యకర్తలు, సానుభూతిపరులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం ఎమ్మెల్యే పరిటాల సునీత పిలుపునిచ్చారు. గురువారం అనంతపురంలోని తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ ముఖ్య నాయకులతో ఆమె సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోనూ పార్టీ జెండాను రెపరెపలాడించాలన్నారు .అలాగే పెండింగ్‌లో ఉన్న గ్రామ, మండల కమిటీల నియామకాలను త్వరగా పూర్తి చేయాలని, పార్టీ కోసం కష్టపడే వారికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.


