ప్రజా సమస్యలు పరిష్కరించడమే మా లక్ష్యం..


ఇన్చార్జ్ ఆర్డిఓ సూర్యనారాయణ రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం; డివిజన్ పరిధిలోని ప్రజా సమస్యలను పరిష్కరించడమే మా లక్ష్యము అని ఇన్చార్జ్ ఆర్డిఓ సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ఆర్‌డీవో కార్యాలయంలో రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని వివిధ సమస్యలకు సంబంధించిన మొత్తం 4 వినతిపత్రాలను సమర్పించారు అని తెలిపారు. అందులో 2 వినతిపత్రాలు మున్సిపాలిటీకి సంబంధించినవిగా, మిగతా 2 వినతిపత్రాలు రెవెన్యూ శాఖకు సంబంధించినవిగా అధికారులు తెలిపారు. గడువు తేదీలోగా సమస్యను పరిష్కరించాలని తాము ఆదేశించడం జరిగిందని తెలిపారు. ప్రజల నుండి అందిన ప్రతి వినతిని ప్రాధాన్యతతో పరిగణించి సంబంధిత శాఖల ద్వారా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు పారదర్శకంగా, సమర్థవంతంగా , వేగవంతంగా అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.స్వీకరించిన వినతులను సంబంధిత శాఖలకు పంపించి, వాటి పరిష్కారంపై పర్యవేక్షణ కొనసాగిస్తామని అధికారులు తెలిపారు. ప్రజలు తమ సమస్యలను ఇలాంటి కార్యక్రమాల ద్వారా తెలియజేసి పరిష్కారం పొందాలని సూచించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *