తెలంగాణ బీసీ స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్ షన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్
విశాలాంధ్ర – హైదరాబాద్ : రాష్ట్ర అభివృద్ధే ద్యేయంగా, ప్రజల ప్రయోజనాలే పరమావధిగా, తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని, అందుకు నిదర్శనం 2026-27 ఆర్థిక బడ్జెట్ అని, ఆర్థిక, రాజకీయ, సామాజిక న్యాయం, దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందడగు వేస్తుందని అందుకు కాంగ్రెస్ నాయకత్వానికి తన హృదయపూర్వక కృతజ్ఞతలు అందజేస్తున్నానని, తెలంగాణ బీసీ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపే లక్ష్యంతో రికార్డ్ స్థాయి పెట్టుబడులను ఆకర్షిస్తూ ముందుకు సాగుతూ ప్రజలు చెల్లించే ప్రతి పైసాకు కాపలాధారుగా ఉంటూ వారి అభ్యున్నతి కోసమే ఈ బడ్జెట్ అత్యంత చిత్తశుద్ధితో రూపొందించడం జరిగిందని అన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అద్భుతమైన ప్రగతిని సాధించిందని దేశ జిడిపి వృద్ధిరేటు 9.8 శాతం నుండి 8 శాతానికి తగ్గి మందగమనంలో ఉన్నప్పటికీ తెలంగాణ వృద్ది రేటు 10.6 శాతం నుండి10.7 శాతానికి మెరుగుపడడం విశేషమని అన్నారు. ప్రస్తుతం ధరల ప్రకారం రాష్ట్ర జిఎస్‌డిపి 17,82,198 కోట్ల రూపాయలకు చేరిందని దేశ సగటు వృద్ధిరేటు కంటే తెలంగాణ 2.7 శాతం అధిక వృద్దిని నమోదు చేస్తుందని ఇందుకు ప్రధాన కారణం తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం సమన్వయంతో పని చేయడమే అని అన్నారు. దేశ జిడిపిలో మన రాష్ట్రం ఐదు శాతం వాటాతో బలమైన గ్రోత్ ఇంజన్‌గా నిలుస్తుందని మన ప్రభుత్వ ఆర్థిక విధానాలు సరియైన దిశలో సాగుతున్నాయనడానికి ఈ గణాంకాలే నిదర్శనమని పేర్కొన్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేసే దిశగా బడ్జెట్ రూపొందించడం అభినందనీయమని వెనుకబడిన తరగతుల సంక్షేమానికి బడ్జెట్లో పెద్దపీట వేశారని దీనితో వారి సంక్షేమానికి మరింత సంక్షేమ కార్యక్రమాలు అందే అవకాశం ఉందని అన్నారు.
మధ్యాహ్న భోజనం పేదలకు వరం…
ముఖ్యంగా బడ్జెట్లో ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమ రంగాలకు పెద్దపీట వేసిందని జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేసేందుకు బడ్జెట్లో నిధులు కేటాయించడం పేద విద్యార్థుల పాలిటవరం అని ఇది అభినందనీయమని, ప్రస్తుతం పాఠశాల వరకే ఈ పథకం అమలు జరుగుతుందని, దీని కాలేజీ విద్యార్థులకు కూడా అమలు చేస్తామని, గతంలో ప్రభుత్వం ప్రకటించి ఇప్పుడు అమలులో పెట్టిందని పాఠశాలల్లో ముఖ్యమంత్రి బ్రేక్ ఫాస్ట్ స్కీములు కూడా ఈ బడ్జెట్లో ప్రతిపాదించడం స్వాగతించదగ్గ అంశమని, ఈ పథకంతో ఇరవై ఒక్క లక్షల మంది విద్యార్థులు ప్రయోజనం పొందడం అభినందించదగ్గ అంశమన్నారు. ఏది ఏమైనా శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి దార్షినితకు నిదర్శనమని నూతి శ్రీకాంత్ గౌడ్ పేర్కొన్నారు.


