విశాలాంధ్ర-రాప్తాడు : పోలీస్ స్టేషన్లో ప్రజలకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ యాప్ ద్వారా 87 రకాల సేవలు అందిస్తామని సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీహర్ష తెలిపారు. గోళ్లపల్లి వద్ద ఉన్న మాంటిస్సోరి ఎలీట్ పాఠశాల విద్యార్థులకు సోమవారం సీఐ శ్రీహర్ష అవగాహన కల్పించారు.
గ్రామాల్లో ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడానికి ఎఫ్.ఐ.ఆర్ (ప్రథమ సమాచార నివేదిక) నమోదు, ఫిర్యాదుల స్వీకరణ, పోగొట్టుకున్న వస్తువులు, వ్యక్తుల ఆచూకీ, వివిధ రకాల ధృవీకరణ పత్రాలు తదితర సేవలు ఉంటాయన్నారు.
నేరాలకు సంబంధించిన ఫిర్యాదులు ఇవ్వడం, ఎఫ్.ఐ.ఆర్ నకలు ఉచితంగా పొందడం, ఎవరి పైనైనా ఎలాంటి కేసులు తమపై లేవని పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్,
పోగొట్టుకున్న వస్తువులు, మొబైల్ ఫోన్లు, వాహనాలు, లేదా వ్యక్తులు తప్పిపోతే రిపోర్ట్ చేయడం, లౌడ్‌స్పీకర్లు, ఊరేగింపులు, మీటింగ్‌లకు అనుమతి పొందడం, సైబర్ నేరాలకు సంబంధించిన ఫిర్యాదులను నమోదు చేయడం ఉంటాయన్నారు.
అదేవిధంగా ట్రాఫిక్ ఉల్లంఘనల జరిమానాల సమాచారం, చెల్లింపులు.
అత్యవసర సహాయం కింద 100 లేదా 112 డయల్ చేయడం ద్వారా తక్షణ సహాయం పొందడం వంటి సేవలు పోలీస్ స్టేషన్లో అందుతాయన్నారు.


