కూనంనేని
విశాలాంధ్ర- హైదరాబాద్: రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న సరెండర్ లీవులు, టీఏ బకాయిలను పోలీసులకు త్వరితగతిన చెల్లించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రభుత్వాన్ని కోరారు. శాసనసభలో బుధవారం జీరో అవర్‌లో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ఖమ్మం జిల్లాలో కొంత వరకు బకాయిలు చెల్లించినప్పటికీ, కొత్తగూడెం జిల్లాలోని పోలీసులకు మాత్రం ఇప్పటివరకు చెల్లింపులు జరగలేదని, బకాయిలను ఎందుకు చెల్లించలేదో అర్ధం కాలేదన్నారు. కొత్తగూడెం పరిధిలోని 6వ బెటాలియన్‌లో సుమారు 450 మంది సిబ్బంది ఉన్నారని, వారు రేయింబవళ్లు కష్టపడుతారని, వారికి కూడా టీఏలు, సరెండర్ లీవ్స్ అందడం లేదన్నారు. ఒక్కో పోలీసు ఉద్యోగికి సుమారు 42 టీఎలు పెండింగ్ ఉన్నాయని, ఒక్కొక్కరికి లక్షల రూపాయల మేరకు బకాయిలు రావాల్సి ఉందని కూనంనేని వివరించారు.


