కౌన్సిలర్ వెల్లాల లలితమ్మ
విశాలాంధ్ర – ఆదోని : ఆదోని మున్సిపాలిటీ పరిధిలోని 35వ వార్డు అమరావతి నగర్ కాలనీలో గత ఒకటిన్నర సంవత్సరం నుండి మెయిన్ రోడ్డులో పైపులైన్ లీకేజీ అవుతోందని ఎన్నిసార్లు అధికారులకు వినతి పత్రాలు ఇచ్చిన లీకేజీ బాగు చేయలేదని కౌన్సిలర్ వెల్లాల లలితమ్మ కౌన్సిల్ సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం ఖచ్ఛితంగా మున్సిపల్ చైర్మన్ లోకేశ్వరి మరియు ఉన్నతాధికారులు వార్డుకు వచ్చి పరిశీలించి పరిష్కారం చూపాలని గట్టిగా డిమాండ్ చేశారు. వెంటనే స్పందించిన చైర్ పర్సన్ లోకేశ్వరి కౌన్సిల్ సమావేశం ముగిసిన వెంటనే 35వ వార్డు అమరావతి నగర్ కాలనీలో పర్యటనకు, మున్సిపల్ డిఈ రామమూర్తి వచ్చి తప్పకుండా పైపులైన్ సమస్యకు పరిష్కారం చూపుతామని హామీ ఇచ్ఛిన మేరకు చైర్మన్ లోకేశ్వరి కౌన్సిలర్ లలితమ్మ తో పాటు అధికారులను వెంటబెట్టుకొని అమరావతి నగర్ కాలనీలో పర్యటించారు.వెంటనే పైపులైన్ లీకేజీ పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.సమస్యపైన వెంటనే స్పందించిన చైర్మన్ లోకేశ్వరికి కౌన్సిలర్ లలితమ్మ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు మధుసూదన్ శర్మ పాల్గొన్నారు.
The post పైపులైన్ లీకేజీ పరిష్కారం కోసం సహకరించాలి appeared first on Visalaandhra.


