రువు ప్రాంత ప్రజల కష్టాలు తీరే నా , వలసలు ఆగేనా*?
ప్రాజెక్ట్ పూర్తికి బడ్జెట్ తో కాకుండా 4000 కోట్లు నిధులు కేటాయించాలి
సీపీఐ రాష్ట కార్యదర్శి జి ఈశ్వరయ్య
దోర్నాల
పుల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ ను ఈ సంవత్సరం జూన్ నాటికి పూర్తిచేస్టారా అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించ్చారు.గురువారం దోర్నాల వద్ద వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణాపనులను సిపిఐ మార్కాపురం జిల్లా నాయకులతో కలిసి ప్రాజెక్ట్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఈశ్వరయ్య మీడియా వారితో మాట్లాడుతూ ఇటీవల రాష్ట్ర ముఖ్య మంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రాజెక్ట్ ను మొదటి పేస్ 2026 జూన్ నాటికి పూర్తిచేసి నీరు ఇస్తాము అని ప్రకటించారు. కానీ బడ్జెట్ లో నిధులు అరకొరగా కేటాఇంపులు పలు అనుమానాలకు అవకాశం అల్పిస్తున్నాయన్నారు. గత 30సంవత్సరాలుగా ప్రభుత్వాల నేరపూరిత నిర్లక్ష్యం కారణంగా ప్రాజెక్ట్ అంచనాలు పెరిగి పోతున్నాయి తప్ప పనులు ముందుకు పోవడంలేదని ఈశ్వరయ్య విమర్శించారు. ఈ ప్రాంత ప్రజలకళలు సకారమై కరువు ప్రాంత ప్రజల కష్టాలుతీరి వలసలు ఆగుతాయా అని సందేహాలు ఎక్కువ వినిపిస్తున్నాయని అన్నారు.ఇప్పటికైనా ముఖ్య మంత్రి గారు బడ్జెట్ తో సంబంధం లేకుండా 4000 కోట్ల రూపాయలు నిధులను వెలుగొండ ప్రాజెక్టు కేటాయించాలని సి పిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు.గురువారం దోర్నాల మండలంలోని కొత్తూరు గ్రామంలో గల పూల సుబ్బయ్య వేలగొండ ప్రాజెక్ట్ సొరంగమార్గాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సిపిఐ మార్కాపురం జిల్లా కార్యదర్శి యం.యల్.నారాయణ, మరియు పార్టీ నాయకులు అందరూ కలిసి వెలుగొండ ప్రాజెక్టు సొరంగాన్ని పరిశీలించి, అక్కడ జరుగుతున్న పనుల గురించి వెలుగొండ ప్రాజెక్టు అధికారులను అడిగి వివరాలను తెలుసుకున్నారు. పనులు ఎమేరకు జరిగాయనే దానిపై అ డిగి తెలుసుకున్నారు, అనంతరం పీడ ర్ కెనాల్ కాలువ పనులను పరిశీలించారు. అక్కడ అధికారులతో పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టుకు బడ్జెట్ తో సంబంధం లేకుండా తో సంబంధం లేకుండా ప్రత్యేక నిధులు కేటాయించి 4000 కోట్లు కేటాయించాలని, అలాగే 11గ్రామాల నిర్వాసితుల ఆర్ & ఆర్ ప్యాకేజి సమస్య పరిష్కరించాలని, ప్యాకేజీ పరిష్కరించాలనికి తక్షణం 1000 కోట్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు.
1996 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాజెక్టు శంకుస్థాపన చేశారని, ఇప్పుడు తనే వెలుగొండ ప్రాజెక్టు నీళ్లు వదులుతాలని చెప్తున్నారని, కనుక ఈ సంవత్సర ప్రాజెక్టు నీరు అదేలా చూడాలన్నారు ప్రాజెక్టు కోసం గత 30 సంవత్సరాల నుండి రైతాంగం, కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురుచూస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి విజ్ఞప్తి చేశారు.
ప్రాజెక్ట్ పూర్తి కావాలంటే 4వేల కోట్ల నిధులు అవసరం అవుతాయని,మొదటి పేస్ కు 2వేల కోట్లు అవసరమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు సందర్శించి వచ్చిన సందర్బంగా మార్కాపురం సభలో ప్రకటించారని సిపిఐ జిల్లా కార్యదర్శి నారాయణ గుర్తు చేశారు.ఈప్రాజెక్ట్ ద్వారా 4లక్షలా 65వేల ఎకరాలకు సాగు నీరు 20లక్షలమందికి తాగునీరు అందుతుందని ఇంతటి ప్రయోజనం చేకూరే ప్రాజెక్ట్ పై నిర్లక్ష్యం తగదన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందే నాసరయ్య, కె.వి కృష్ణ గౌడ్, డి శ్రీనివాసులు, బి రామయ్య, యస్. డి.మౌలాలి, యస్.కే. కాశీం, పి ప్రభాకర్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ పవన్ కళ్యాణ్, కనిగిరి మండల కార్యదర్శి జిపి రామారావు, త్రిపురాంతకం మండల కార్యదర్శి దాసరి మల్లికార్జున, వైపాలెం మండల కార్యదర్శి సాంబశివరావు, పుల్లలచెరువు మండల కార్యదర్శి గురునాథం, దోర్నాల మండల కార్యదర్శి విశ్వరూప ఆచారి,సి.యస్. పురం మండల కార్యదర్శి పెద మస్తాన్,గిద్దలూరు నియోజకవర్గ సహాయ కార్యదర్శి జోసెఫ్, రంగ సాయి, గులామ్, వి.సుబ్బారావు, పాలపత్తి మస్తాన్ రావు, తిరుపతయ్య పామూరు కనిగిరి, సి. యస్.పురం, కనిగిరి, త్రిపురాంతకం, వైపాలెం, పుల్లలచెరువు,కొనకనమిట్ల, కంభం, బెస్తవారిపేట మండలాల నాయకులు, కార్యకర్తలు,నెల్లూరు సిపిఐ పార్టీ నాయకులు అంకయ్య మాల కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


