ఏపీలో ప్రజలు ఒకేసారి రెండు భయాలతో వణికిపోతున్నారు. ఒకవైపు పెద్దపులి సంచారం కలవరపెడుతుంటే, మరోవైపు కోతుల బెడద రోజురోజుకూ భయానకంగా మారుతోంది. గ్రామాలు మాత్రమే కాదు, పట్టణాల్లో కూడా కోతుల ఉనికి పెరగడంతో ప్రజలు ఇంటి నుంచి బయటకు రావడానికే ఆలోచించే పరిస్థితి నెలకొంది. స్కూల్‌కి వెళ్లాలన్నా, పనికి వెళ్లాలన్నా, బస్‌స్టాండ్ లేదా రైల్వే స్టేషన్‌కి వెళ్లాలన్నా భయంతో అడుగులు వేయాల్సి వస్తోంది.



