పిడుగులు, వడగళ్ల వానలు.. ఆ జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు..! Thunderstorms and rain for three. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)


Last Updated:

ఆంధ్రప్రదేశ్‌లో రానున్న మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణ శాఖ అధికారి జగన్నాథ కుమార్ హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఏపీలో ఆ జిల్లాలకు భారీ వర్షాలు..! వడగళ్ల వానలు..!
ఏపీలో ఆ జిల్లాలకు భారీ వర్షాలు..! వడగళ్ల వానలు..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారనున్నాయి. సంవహన వర్షాలు, ద్రోణి ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు. ఈ విషయాన్ని వాతావరణ శాఖ అధికారి జగన్నాథ కుమార్ వెల్లడించారు. అదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నాయని తెలిపారు.

ప్రత్యేకించి మొదటి రెండు రోజుల్లో కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లా, చిత్తూరు జిల్లా, శ్రీ సత్యసాయి జిల్లా, అనంతపురం జిల్లా ప్రాంతాల్లో భారీ వర్షాలతో పాటు వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కొన్ని చోట్ల రెండు నుంచి మూడు గంటల వ్యవధిలోనే గట్టిగా వర్షాలు పడే అవకాశముందని హెచ్చరిస్తున్నారు.

ఇక ఉత్తర కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. పార్వతీపురం మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా, విజయనగరం జిల్లా, అనకాపల్లి జిల్లా, పోలవరం ప్రాంతం, ఉభయ గోదావరి జిల్లాలు, ఏలూరు జిల్లా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముందని తెలిపారు. అలాగే కాకినాడ, బాపట్ల జిల్లా, పల్నాడు జిల్లా ప్రాంతాల్లో కూడా వర్ష సూచనలు ఉన్నాయని పేర్కొన్నారు. తీరప్రాంతాల్లో గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉండగా, కొన్ని సందర్భాల్లో 50 కిలోమీటర్ల వేగం దాటే అవకాశముందని హెచ్చరించారు.

ప్రజలందరూ రాబోయే మూడు రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తోంది. ముఖ్యంగా మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని హెచ్చరిస్తున్నారు. పిడుగులు పడే సమయంలో చెట్ల కింద నిలబడకూడదని, అత్యవసర పరిస్థితుల్లో నేలపై వంగి ఉండాలని సూచిస్తున్నారు. మొత్తంగా రాష్ట్రంలో వర్షాలు, గాలివానల ప్రభావం కనిపించనున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండటం అత్యవసరం. అధికారుల సూచనలు పాటిస్తూ, అవసరం లేనప్పుడు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలను తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *