విశాలాంధ్ర- ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఉరవకొండ పిఎసిఎస్( ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ) చైర్మన్ పదవి కల్పించినందుకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కు మరియు పార్టీ సీనియర్ నాయకులు పయ్యావుల శ్రీనివాసులకు నూతన చైర్మన్ గా ఎన్నికైన ప్యారం కేశవానంద హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన బుధవారం పార్టీ సీనియర్ నాయకులు పయ్యావుల శ్రీనివాసులును కలిసి సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్యారం కేశవానంద మాట్లాడుతూ, తమపై విశ్వాసం ఉంచి బాధ్యతలు అప్పగించినందుకు మంత్రి కేశవ్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ పదవిని ప్రజాసేవకు వినియోగిస్తానని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో కృషి చేస్తానని చెప్పారు. పార్టీ ఆశయాలు, ప్రభుత్వ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లే దిశగా పనిచేస్తానని స్పష్టం చేశారు. మంత్రి మార్గదర్శకత్వంలో తన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించి, ఉరవకొండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని మరియు రైతుల యొక్క అభివృద్ధికి కట్టుబడి ఉంటానని తెలిపారు.


