పశ్చిమాసియాలో చిక్కుకున్న భారతీయుల కోసం కంట్రోల్‌రూం


-అందుబాటులో హెల్ప్‌లైన్‌ నంబర్లు

న్యూదిల్లీ: పశ్చిమాసియాలో తీవ్ర యుద్ధం కొనసాగుతుండటంతో అక్కడి పలు దేశాల్లో అనేకమంది భారత పౌరులు చిక్కుకుపోయారు. వీరికి కావాల్సిన సహకారాన్ని అందించడానికి భారత విదేశీ వ్యవహారాల శాఖ ప్రత్యేక కంట్రోల్‌ రూంని ఏర్పాటుచేసింది. ప్రభావిత ప్రాంతాల్లోని భారతీయుల కోసం హెల్ప్‌లైన్‌ నంబర్లను ప్రకటించింది. ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు ఈ కంట్రోల్‌ రూం అందుబాటులో ఉంటుందని తెలిపింది. 1800 118797 టోల్‌ఫ్రీ నంబరును గానీ, ం91 11 2301 2113, ం91 11 2301 4104, ం91 11 2301 7905 నంబర్లను గానీ సంప్రదించాలని సూచించింది. దీనితో అక్కడి వారి మన యోగక్షేమాలను తెలుసుకొనే వెసులుబాటు కలిగినట్లు అయింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *