పవన్ కల్యాణ్ కాన్వాయ్ కి ప్రమాదం


ప్రమాద సమయంలో వాహనంలో లేని పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కాన్వాయ్‌కు ఈ ఉదయం స్వల్ప ప్రమాదం జరిగింది. విశాఖలోని సిరిపురం నుంచి పెద్ద వాల్తేరు వైపు వెళ్తుండగా… త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో కాన్వాయ్‌లోని ఒక వాహనం సడన్ బ్రేక్ వేయడంతో, వెనుక వచ్చిన వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో వాహనం ముందు భాగం స్వల్పంగా దెబ్బతింది. ప్రమాద సమయంలో వాహనంలో పవన్ కల్యాణ్ లేరు. రాడిసన్ బ్లూ హోటల్ లో ఉన్న పవన్ ను పికప్ చేసుకోవడానికి వెళుతుండగా కాన్వాయ్ ప్రమాదానికి గురయింది.ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అధికారులు, భద్రతా సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. దర్యాప్తు చేపట్టారు. ఈరోజు మధ్యాహ్నం జరగబోయే అధికారిక కార్యక్రమాలకు హాజరయ్యేందుకు ఆయన విశాఖకు వచ్చినట్లు సమాచారం.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *