పన్నులు వందశాతం వసూలు చేయాలి ఎంపీడీఓ : శంకరరావు


విశాలాంద్ర – వలేటివారిపాలెం : సచివాలయం సిబ్బంది తమ పరిధిలోని గ్రామాలలో పన్నులు వందశాతం వసూలు చేయాలని ఎంపీడీఓ వై. శంకరరావు అన్నారు.
శనివారం అమ్మపాలెం గ్రామం లో జరుగుతున్న యుఎఫ్ ఎస్ సర్వే స్పెషల్ డ్రైవ్ ను ఎంపీడీఓ వై. శంకరరావు, డిప్యూటీ ఎంపీడీఓ రాంబాబు పరిశీలించారు.ఈ సందర్బంగా ఎంపీడీఓ శంకరరావు మాట్లాడుతూయుఎఫ్ ఎస్ సర్వే,ఇంటి పన్నులు వందశాతం పూర్తి చేయాలని అన్నారు సచివాలయం పరిధిలోని గ్రామాలలో సర్వే లు త్వరగా పూర్తి చేయాలని సిబ్బంది కి తెలియజేశారు. ఇంటి పన్నులు వసూలు ప్రజలు ఇంటి వద్ద ఉన్న సమయంలో వారి ఇంటివద్ద కు వెళ్లి పన్నులు వసూలు చేయాలని సిబ్బంది ని ఆదేశించారు. అనంతరం అమ్మపాలెం ఎస్ డబ్ల్యూ పీ సీ షెడ్ ను పరిశీలించి సిబ్బంది కి చూచనలు చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వై. శంకరరావు, డిప్యూటీ ఎంపీడీఓ (జిఎస్ డబ్యూ ఎస్ )బి రాంబాబు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *