నేపాల్‌లో 65 శాతం పోలింగ్ – Visalaandhra


ఎన్నికలు ప్రశాంతం
ఖాట్మండు: నేపాల్‌లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. గురువారం ఉదయం 7 గంటలకు 165 నియోజకవర్గాల్లో గట్టి బందోబస్తుతో ఓటింగ్ మొదలైంది. గతేడాది ఓలీ ప్రభుత్వాన్ని కూల్చిన జెన్‌జీ ఆందోళన తర్వాత జరిగిన ఎన్నిక కావడంతో దీనికి ప్రాధాన్యత ఏర్పడింది. ఉదయం 11 గంటల సమయానికి 1,823,824 ఓట్లు పోలైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది. మొత్తం ఓటర్లలో ఈ సంఖ్య పది శాతంగా పేర్కొంది. సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరిగింది. క్యూలైన్లలో ఉన్న చివరి ఓటరు సైతం తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు అధికారులు వెల్లడించారు. 165 స్థానాల ప్రతినిధుల సభకు మొత్తం 65 పార్టీలు పోటీ చేశాయి. 3,406 మంది తమ అదష్టాన్నీ పరీక్షించుకున్నారు. అభ్యర్థుల్లో 388 మంది మహిళలు ఉన్నారు. దామాషా పద్ధతిలో జరిగే ఓటింగ్ ద్వారా 110 స్థానాలకుగాను 3,135 మంది పోటీ చేయగా, ఇందులో 1,772 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. దేశంలో 18,903,689 మంది అర్హులైన ఓటర్లు ఉండగా వీరిలో 9,66,33,58 మంది పురుషులు, 9,240,131 మంది మహిళలు, 200 ఇతరులు ఉన్నారు. నేపాల్ వ్యాప్తంగా 23,112 పోలింగ్ కేంద్రాలను 10,967 ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. 79,727 మంది సైనికులు, 75,797 మంది పోలీసులు, 34,567 మంది సాయుధ పోలీసు దళసభ్యులు, 1,921 మంది జాతీయ దర్యాప్తు విభాగ సిబ్బంది, 1,49,090 మంది పోలీసులు ఎన్నికల విధుల్లో ఉన్నారు. అత్యధికంగా 65 శాతం పోలింగ్ నమోదు కావచ్చని సీఈసీ రామ్ ప్రసాద్ భండారీ వెల్లడించారు. ఉదయం నుంచి అనేక జిల్లాల ప్రతినిధులతో మాట్లాడగా, అన్ని చోట్ల ఓటింగ్ ప్రశాంతంగా సాగుతోందని, ప్రజలు తమ ఓటు హక్కును ఉత్సాహంగా వినియోగించుకుంటున్నారని తెలిసిందని చెప్పారు. గిరి ప్రాంతాలు సహా అన్ని నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటýకే ఓటింగ్ ప్రారంభమైనట్లు ఎన్నికల సంఘం అధికార ప్రతినిధి నారాయణ్ ప్రసాద్ భట్టారాయ్ తెలిపారు. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు మొదలవుతుందన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *