నేను బతికే ఉన్నా: నెతన్యాహు – Visalaandhra


తెలఅవీవ్: ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మృతి చెందినట్లు సామాజిక మాధ్యమాల్లో జరిగిన ప్రచారానికి ఆయనే స్వయంగా తెరదించారు. తాను చనిపోలేదని నిరూపించుకునేందుకు సామాజిక మాధ్యమాల్లో కొన్ని పోస్టులు పెట్టారు. ఇజ్రాయిల్‌కు అమెరికా రాయబారి మైక్ హక్కబీతో కలిసి ఉన్న ఓ వీడియోను తాజాగా విడుదల చేశారు. అందులో నెతన్యాహుతో మైక్ మాట్లాడుతూ ‘మీరు చనిపోయారని వార్తలు వస్తుండటంతో వెళ్లి చూసి రమ్మని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నన్ను పంపారు’ అని అనడం… అందుకు నేను బతికే ఉన్నానని నెతన్యాహు సమాధానం ఇవ్వడం కనిపిస్తుంది. కొన్ని రోజులుగా తన మరణంపై అసత్య ప్రచారాలకు నెతన్యాహు తనదైన శైలిలో ముగించారు. ఇరాన్‌తో యుద్ధం ముదురుతున్న తరుణంలో నెతన్యాహు చనిపోయారంటూ వచ్చిన వార్తలను కొట్టిపారేస్తూ ఒక ప్రత్యేక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఈ వీడియో వైరలైంది. ఈ సంభాషణలో ఇరాన్ అగ్రనేతల వరుస హత్యలను నెతన్యాహు ప్రస్తావించారు. ఇరాన్ భద్రతా చీఫ్ అలీ లారిజానీ, బాసిజ్ కమాండర్ సులేమానీ పేర్లT హిట్ లిస్ట్ నుంచి తొలగించినట్లు తెలిపారు. ‘నా దగ్గర కార్డులో నుంచి రెండు పేర్లT చెరిపేశాను. ఇందులో ఇంకా ఎన్ని పేర్లు ఉన్నాయో చూడండి’ అంటూ ఇరాన్ నాయకత్వానికి నెతాన్యాహు హెచ్చరించారు. అంతకు ముందు ఒక కేఫ్ దగ్గర కాఫీ తాగుతున వీడియోను ఆయన పంచుకున్న ఆయన అందులో తన రెండు చేతులను కెమెరా వైపు చూపిస్తూ ‘నా వేళ్లు లెక్కపెడతారా? చూడండి.. అన్నీ సరిగ్గానే ఉన్నాయి కదా!’ అంటూ గతంలో తన చేతికి ఆరు వేళ్లు ఉన్నాయన్న ప్రచారానికి సైతం నెతన్యాహు చెక్ పెట్టారు. ‘అమెరికా దళాలతో కలిసి ముందుకెళ్లడం గర్వంగా ఉందని, ఇజ్రాయిల్‌ను తుడిచి పెట్టి… అమెరికా నగరాలపై అణ్వాయుధాలు ప్రయోగించాలనుకుంటున్న పిచ్చివాళ్ల (ఇరాన్ నేతలు)ను ఏరిపారేస్తున్నాం’ అని నెతన్యాహు వ్యాఖ్యానించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *