విశాలాంధ్ర-ధర్మవరం; పట్టణంలోని శ్రీనివాసా నగర్ లో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బెంగళూరు అరుణ్ కుమార్, నామాల శ్రీనివాసులు దాతల ద్వారా ఉచితంగా మంజునాథ్, అనూష వధూవరులకు తాళిబొట్టు, కాలిమెట్టలు, వివాహానికి సంబంధించిన వస్త్రాలు అందజేశారు. సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు చెన్నం శెట్టి జగదీశ్వర్ ప్రసాద్ మాట్లాడుతూ నూతన వధూవరులు పేద కుటుంబం అయినందున ఈ సహకారం అందించడం జరిగిందని తెలిపారు. అనంతరం వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జింక రాజేంద్రప్రసాద్, చెన్నం శెట్టి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.


