నూతన అధ్యక్షులుగా పి. లక్ష్మీనారాయణ ఎంపిక
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కోర్టులో గల బార్ అసోసియేషన్ కార్యాలయంలో నూతన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ నూతన కమిటీలో అధ్యక్షులుగా పి.లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షులుగా కె. రామచంద్రారెడ్డి, జనరల్ సెక్రెటరీగా కె. కిషోర్ కుమార్, గ్రంథాలయ సెక్రెటరీగా నరసింహమూర్తి, కోశాధికారిగా బిల్లే రవి, సభ్యులుగా ఈ. ప్రసాద్, టి. బాబా ఫక్రుద్దీన్, పి. భార్గవి, జె. శివకుమార్, టి. వెంకటరామిరెడ్డి, పీవీ బీవీ ప్రసాద్ ఎంపికయ్యారు. అనంతరం నూతన కమిటీ వారు మాట్లాడుతూ న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. బార్ ను అభివృద్ధి బాటలో నడుపుతామని తెలిపారు. అనంతరం సీనియర్ ,జూనియర్ న్యాయవాదులు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.


