నిర్లక్ష్యానికి పరాకాష్ట – సర్వీసు రోడ్డుకు అడ్డంగా చేన్లోకి రోడ్డు


విశాలాంధ్ర-రాప్తాడు(అనంతపురం జిల్లా) : మండల సమీపంలోని అశోక్ లేలాండ్ ఎదురుగా ఉన్న పొలాల్లో ఏర్పాటు చేసుకున్న ఓ ప్రైవేట్ షెడ్డుకు వెళ్లేందుకు ఏకంగా సర్వీస్ రోడ్డుకు అడ్డంగా భారీగా మట్టి మేటలు వేశారు. నిబంధనలకు విరుద్ధంగా సర్వీస్ రోడ్డును మూసివేస్తూ ఇలా మట్టి తోలడం అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలుస్తోంది. దీనివల్ల అటుగా వెళ్లే కార్లు, ద్విచక్ర వాహనాలు వెళ్లడానికి వీలులేక ప్రమాదాలకు గురవుతున్నాయి. సర్వీస్ రోడ్లు ఆక్రమణకు గురికావడం, ఉన్న రోడ్డు గుంతలమయం కావడంతో వాహనదారులు విధిలేక మెయిన్ హైవేపై ఃరాంగ్ రూట్ఃలో ప్రయాణిస్తున్నారు. వేగంగా వచ్చే భారీ వాహనాలు ఢీకొంటే ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమయ్యే ప్రమాదం ఉంది. జాతీయ రహదారి అధికారులు, మండలాధికారులు ఇప్పటికైనా స్పందించి, ఆక్రమణలను తొలగించి, గుంతలను పూడ్చి సర్వీస్ రోడ్డును పునరుద్ధరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *