నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. కుప్పంలో మెగా జాబ్ మేళా.. 33 కంపెనీలు, రూ.35 వేల వరకు జీతం..! Kuppam mega job mela on March 25 33 companies. | చిత్తూరు వార్తలు (Chittoor News)


Last Updated:

కుప్పం లో మార్చి 25 మెగా జాబ్ మేళా. APSSDC ఆధ్వర్యంలో 33 కంపెనీలు పాల్గొని చిత్తూరు నిరుద్యోగ యువతకు 13000 నుంచి 35000 జీతాలతో అవకాశాలు.

25 న కుప్పంలో  మెగా జాబ్ మేళా కానీ వీరు మాత్రమే అర్హులు
25 న కుప్పంలో  మెగా జాబ్ మేళా కానీ వీరు మాత్రమే అర్హులు

నిరుద్యోగ యువతకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఒక్కసారి మీ ప్రతిభకు పదును పెడితే భవిష్యత్తులో స్థిరపడే అవకాశాలు మెండుగా ఉన్నాయని చిత్తూరు జిల్లా యువతకు పిలుపునిచ్చింది. ముఖ్యంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కుప్పంలో మార్చి 25న భారీ స్థాయిలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రభుత్వ విప్ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ వెల్లడించారు.

ఈ మెగా జాబ్ మేళా రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) మరియు ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ సంయుక్త ఆధ్వర్యంలో కుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించనున్నారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎం. గుణశేఖర్ రెడ్డి కూడా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ జాబ్ మేళా ద్వారా జిల్లాలోని నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

ఈ నియామక ప్రక్రియలో సుమారు 33 ప్రముఖ కంపెనీలు పాల్గొననున్నాయి. అభ్యర్థుల ప్రతిభను బట్టి ఎంపిక చేసి, నెలకు రూ.13,000 నుంచి రూ.35,000 వరకు జీతం అందించనున్నట్లు తెలిపారు. పదో తరగతి, ఇంటర్మీడియట్, ITI, డిగ్రీ, B.Tech, B.Pharmacy పూర్తి చేసిన అభ్యర్థులందరూ ఈ జాబ్ మేళాలో పాల్గొనే అర్హత కలిగి ఉంటారు. 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు గల స్త్రీ, పురుష అభ్యర్థులు హాజరుకావచ్చని అధికారులు స్పష్టం చేశారు.

ఈ అవకాశాన్ని చిత్తూరు జిల్లా నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అభ్యర్థులు తమ వెంట విద్యార్హత సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు, ఆధార్ కార్డు, బయోడేటా తీసుకురావాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం ధర్మేంద్ర (9493903896), తరుణ్ (6303328587), రాజా (9052507933) నంబర్లను సంప్రదించాలని తెలిపారు. కుప్పంలో నిర్వహించనున్న ఈ మెగా జాబ్ మేళా నిరుద్యోగులకు ఒక సువర్ణావకాశంగా మారనుంది.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *