నియమ నిబంధనల ప్రకారమే ప్రైవేట్ ఆసుపత్రులు నడుపుకోవాలి


డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ భాగ్యలక్ష్మి
విశాలాంధ్ర ధర్మవరం:: ప్రభుత్వ నియమ నిబంధనలు ప్రకారమే ప్రైవేట్ ఆసుపత్రులు నడుపుకోవాలని డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ భాగ్యలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా వారు వారి కార్యాలయంలో పట్టణంలోని ప్రైవేట్ డాక్టర్స్ తో సమావేశం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ , జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ ఆదేశానుసారము సమావేశం నిర్వహించి పలు విషయాలను తెలియజేశారు. ముఖ్యంగా ప్రైవేట్ హాస్పిటల్స్ కు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ ఉండాలి, అలాగే అనుమతి ఉండాలి, హాస్పిటల్స్ లో పనిచేయుచున్న డాక్టర్లు క్వాలిఫికేషన్ బట్టి వారు సేవలు అందించాలని, క్వాలిఫికేషన్ లేని సేవలను అందించకూడదని తెలియజేశారు.అలాగే పిసి పిఎన్డిటి యాక్ట్ ప్రకారం స్కానింగ్ సెంటర్లను నడుపుకోవాలని సూచించారు. అలాగే హాస్పిటల్స్ నందు ల్యాబ్ లకు కూడా అనుమతి తీసుకుని క్వాలిఫైడ్ ల్యాబ్ టెక్నీషియన్స్ను పెట్టుకోవాలని తెలిపారు. అలాగే ప్రతి హాస్పిటల్ పరిశుభ్రంగా ఉంచుకొని పట్టణ ప్రజలకు సేవలు అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో చెన్నారెడ్డి పాల్గొన్నారు. తదుపరి ప్రవేట్ డాక్టర్స్ అందరూ కొత్తగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ భాగ్యలక్ష్మి అభినందన శుభాకాంక్షలు తెలిపారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *