జిసిసి ఉద్యోగులు,సిబ్బంది మీటింగులో డిఎం రామారావు
విశాలాంధ్ర, పార్వతీపురం:గిరిజనులు పండించిన / సేకరించిన అటవీ ఉత్పత్తులకు సంబంధించి ఈఏడాది నాలుగ కోట్లరూపాయల ఉత్పత్తుల సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నట్లు గిరిజన సహకార సంస్థ డివిజనల్ మేనేజర్ జె. రామారావు తెలిపారు. గురువారం నాడు పార్వతీపురం బ్రాంచ్ కార్యాలయంలో ఐటీడీఏ పరిధిలోగల జిసిసి బ్రాంచ్ మేనేజర్లు,ఉద్యోగులు, సిబ్బందితో సమావేశాన్ని నిర్వహించారు. విశాలాంధ్ర దినపత్రికలో వచ్చిన కథనానికి స్పందిస్తూ గిరిజనులనుండి జిసిసి నిర్ణయించిన ధరల మేరకు కొనుగోలు చేస్తున్నామని తెలిపారు.గిరిజనుల ధరలు అందించే క్రమంలో గిరిజన సహకార సంస్థ 2025-26 సంవత్సరానికి గాను ధరలు పట్టికను తెలిపారు.కిలో చింతపండు 36 రూపాయలని, పిక్కతీసిన చింతపండు కిలో 67 రూపాయలన్నారు.కానుగ గింజలుకిలో25,విప్పగింజలుకిలో 29,
తాటి బీడ్లుకిలో 114రూపాయలనిచెప్పారు.ఎంఎస్పి క్రిందరాని ఉత్పత్తులధరలను కూడా వివరించారు.తేనెగూడు18,
ముద్దడిగింజలు100,తానికాయలు18,
నల్లజీడిపప్పులు35,తుంగతొండ కాయలు35,శీకాయ40,
అడవి / కొండ తేనె300,పెళ్ళి తేనె150,
తేనె మైనం160,పువ్వు చింతపండు90,
చిల్లగింజలు 50, నరసమిడిచెక్క18 రూపాయలని తెలిపారు. ఇతర ఉత్పత్తులుఎండు ఉసిరికపప్పు90,
చింతగింజలు10,మారేడుగింజలు 450,
మారేడుకాయలు (పొట్టు)50,
విప్పపువ్వు17రూపాయలనితెలిపారు.
వ్యవసాయఉత్పత్తులయిన సెనగలు 115,
రాగులు (ఎరుపు) 90,రాగులు (తెలుపు)90,జొన్నలు 50రాగి 35ఎండు మిరపకాయలు135 రూపాయలని చెప్పారు. గిరిజనలు పండించిన ఉత్పత్తులను జిసిసి ద్వారా అమ్మకాలు చేపట్టి తగు లాభాలు పొందాలని కోరారు. దళారులనుఆశ్రయించవద్దన్నారు. జిసిసి ఉద్యోగులు సిబ్బంది ప్రతి గ్రామానికి వెళ్లి రైతులకు అవగాహన కల్పిస్తూ జిసిసి మద్దతుదారులను తెలియచేయాలన్నారు. మధ్యవర్తులు, దళారులను గిరిజనులు ఆశ్రయించకుండా చూడాలన్నారు. గిరిజనుల కోసం పనిచేస్తున్న గిరిజన సహకార సంస్థ లక్ష్యాలను వివరించాలని తెలిపారు. ఐటిడిఏపరిధిలో ఐదు మండలాల్లో చింతపండు పంట ఉత్పత్తులు కొనుగోలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో పార్వతిపురం బ్రాంచ్ మేనేజర్ మురాల సాంబశివరావు, అకౌంటెంట్ ఎల్ తేజారాణి, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.


