నాటు సారాయి తయారీదారులపై దాడి.. ఒకరు అరెస్టు


పది లీటర్లు నాటు సారాయి స్వాధీనం.. ఎక్సైజ్ సీఐ చంద్రమణి
విశాలాంధ్ర ధర్మవరం అనంతపురం : డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య ఆదేశాల మేరకు ధర్మవరం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సీఐ చంద్రమణి ఆధ్వర్యంలో నాటు సారాయి తయారీదారులు అమ్మకపుదారులపై దాడులు నిర్వహించారు. అనంతరం సిఐ చంద్రమణి మాట్లాడుతూ ఈ దాడుల్లో మండల పరిధిలోని నేలకోట తండా గ్రామములోని మారెమ్మ గుడి వద్ద నేలకోట తండా గ్రామానికి చెందిన వి ఆంజనేయులు నాయకులు అరెస్టు చేసి అతని వద్ద 10 లీటర్ల నాటు సారాయిని స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. తదుపరి కేసు నమోదు చేసి కోర్టుకు తరలించడం జరిగిందన్నారు. కోర్టు వారు రిమాండ్కు ఆదేశించడం జరిగిందని తెలిపారు. ఎవరైనా నాటు సారాయి తయారుచేసిన, విక్రయించిన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదేవిధంగా తరచుగా ఎక్సైజ్ నేరములు చేసే వ్యక్తులను పాత నేరస్తులను బైండోవర్ కేసులు కూడా నమోదు చేస్తామని వారు హెచ్చరించారు. ఎవరైనా నాటు సారాయి తయారీదారుల గురించి గానీ అమ్మకము రవాణా చేసే వారి గురించి గానీ తెలిసిన యెడల మాకు సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి పేరును గోప్యంగా ఉంచుతామని తెలిపారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *