మాజీ ఆర్మీ చీఫ్ మనోజ్ నరవణే రచించిన ఆత్మకథ దేశ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది.
ఈ పుస్తకం వెలుగులోకి రావడం వెనుక ఉద్దేశపూర్వక ప్రణాళిక ఉందా అనే అనుమానాలు బలపడుతున్నాయి.ఈ వ్యవహారంపై చేపట్టిన దర్యాప్తులో ఒక్కొక్కటిగా సంచలన విషయాలు బయటపడుతున్నాయి.నరవణే రాసిన ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ అనే పుస్తకాన్ని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో ప్రస్తావించడంతో ఈ వివాదం మరింత ముదిరింది.పుస్తకంలోని అంశాలపై ఆయన ప్రశ్నలు లేవనెత్తగానే కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ అభ్యంతరం తెలిపారు.ఆ సమయంలో స్పీకర్ ఓం బిర్లా కూడా రాహుల్ గాంధీ మైక్‌ను నిలిపివేయడంతో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నిరసన వ్యక్తం చేసింది.
ఢిల్లీ పోలీసులు కేసు నమోదు
మరుసటి రోజు పార్లమెంట్ ఆవరణలోనే ప్రతిపక్ష నేత ఆ పుస్తకాన్ని మీడియాకు చూపించారు.
ఇది కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. కేంద్ర అనుమతి లేకుండానే పుస్తకం ఎలా ప్రచురితమైందన్న ప్రశ్నలు తలెత్తడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
అదే సమయంలో ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.
తాజా దర్యాప్తులో పుస్తకం లీక్ వెనుక అక్రమ చర్యలు జరిగినట్లు అధికారులు గుర్తించారు.
రక్షణ మంత్రిత్వ శాఖ అనుమతి లేకుండానే ముందస్తు ప్రణాళికతో పుస్తకాన్ని బయటకు తెచ్చినట్లు తేలింది.పుస్తకం ముద్రణ పూర్తైన వెంటనే ఆన్‌లైన్‌లో తొలుత కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ, అమెరికా దేశాల్లో విక్రయాలు ప్రారంభమైనట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు.
దర్యాప్తులో మరో కీలక విషయం
అమెజాన్ వేదికగా అమ్మకాలు జరిగినట్లు కూడా కేంద్రం గుర్తించడంతో,ఈ లీక్ వెనుక భారీ స్థాయి కుట్ర ఉందన్న అనుమానాలు బలపడ్డాయి.దర్యాప్తులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. లీక్ అయిన పుస్తక కాపీ తొలుత బ్రిటిష్ హిందూ మహాసముద్ర ప్రాంతానికి సంబంధించిన కంట్రీ కోడ్ డొమైన్ అయిన ఐఓ డొమైన్‌కు అప్‌లోడ్ చేసినట్లు అధికారులు గుర్తించారు.ఆ తర్వాత అది అనేక ఇతర హోస్టింగ్ ప్లాట్‌ఫామ్‌లకు వ్యాపించినట్లు తేలింది. ఇక పుస్తకానికి సంబంధించిన ISదీచీ నంబర్‌పై కూడా దర్యాప్తు సంస్థ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది.
పుస్తకాన్ని గుర్తించడానికి ఉపయోగించే 13 అంకెల కోడ్
ISదీచీ అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ బుక్ నంబర్ – పుస్తకాన్ని గుర్తించడానికి ఉపయోగించే 13 అంకెల కోడ్. లీక్ అయిన ISదీచీ నంబర్ నరవణే రాసిన ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ పుస్తకానిదేనని అధికారులు నిర్ధారించారు.ఈ కోడ్‌కు సంబంధించి పబ్లిషర్ పెంగ్విన్ ఇండియాను కూడా విచారించనున్నారు.
ఆశ్చర్యకరంగా, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీల్లో ఆన్‌లైన్‌లో అమ్ముడైన పుస్తకాలకు ఉపయోగించిన ISదీచీ కోడ్ కూడా పెంగ్విన్ ఇండియాదేనని సమాచారం.
మొత్తం వ్యవహారం అంతర్జాతీయ స్థాయిలో పన్నిన కుట్రగా దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
నరవణే పుస్తకంపై ఎఫ్‌ఐఆర్ నమోదు
ఇదిలా ఉండగా, ఈ వ్యవహారంపై రాహుల్ గాంధీ ఇటీవల స్పందించారు.
నా పుస్తకం అందుబాటులో ఉందని మనోజ్ నరవణే స్వయంగా ట్వీట్ చేశారు. పుస్తకం ఇంకా ప్రచురితం కాలేదని పబ్లిషర్ పెంగ్విన్ చెబితే అది అబద్ధం కావచ్చు… లేకపోతే నరవణే అయినా నిజం చెప్పలేదని భావించాల్సి ఉంటుంది. నేను మాత్రం నరవణే ట్వీట్‌కే నమ్మకం ఇస్తున్నాను. పుస్తకం అమెజాన్‌లో అందుబాటులో ఉంది. అందులో భారత ప్రభుత్వానికి, ప్రధాని మోడీకి ఇబ్బంది కలిగించే అంశాలు ఉండే అవకాశం ఉందిఁ అని ఆయన వ్యాఖ్యానించారు.నరవణే పుస్తకంపై ఎఫ్‌ఐఆర్ నమోదు అయిన తర్వాతే రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.


