థియేటర్లలోనే శివాజీ`లయ కొత్త చిత్రం?


హైదరాబాద్: శివాజీ, లయ జంటగా నటించిన సినిమా ‘సంప్రదాయని సుప్పిని సుద్దపూసని’ చిత్రం థియేటర్లలోనే విడుదల చేయాలని ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ టీమ్‌తో కలిసి నిర్మించిన హీరో శివాజీ నిర్ణయించుకున్నట్లు సమాచారం. నిజానికి ఫిబ్రవరి 12న ఈ చిత్రం ఈటీవీ విన్‌లో నేరుగా స్ట్రీమింగ్ అవుతుందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. కానీ అలా జరగలేదు. శివాజీ ఈ సినిమాకు నిర్మాత కూడా కావడంతో చివరి నిమిషంలో ఆయన ఓటీటీలో కాకుండా థియేటర్లలోనే విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారట. అందుకే ఓటీటీ స్ట్రీమింగ్ ఆగిపోయిందని తెలుస్తోంది. కాస్తంత సమయం తీసుకుని, మళ్లీ భారీగా ప్రచారం చేసి, సినిమాను మార్చి మొదటివారంలో థియేటర్లలోనే విడుదల చేయనున్నట్లు సమాచారం. శివాజీ, లయ జంటగా నటించిన ఈ సినిమాలో రోహన్, ప్రిన్స్, అలీ, ధన్‌రాజ్, ఇమ్మాన్యూయేల్ ఇతర పాత్రలను పోషించారు. సుధీర్ శ్రీరామ్ దీనికి దర్శకత్వం వహించగా, రంజిన్ రాజ్ సంగీతం సమకూర్చారు.

The post థియేటర్లలోనే శివాజీ`లయ కొత్త చిత్రం? appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *