థాంక్యూ సీఎం సార్ అంటూ 108 ఉద్యోగుల కృతజ్ఞతలు


విశాలాంధ్ర – మండపేట : 108 ఉద్యోగులకు 2 వేల రూపాయల జీతం పెంచడంతోపాటు ఐదేళ్లు సర్వీస్ పూర్తి చేసుకున్న ఉద్యోగులను ఆటోమేటిక్ స్లాబ్ అప్ గ్రేడేషన్ కిందకి తీసుకురావడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఏపీ 108 సర్వీసెస్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ కోనసీమ జిల్లా ప్రధాన కార్యదర్శి మేడిశెట్టి రాజు తెలిపారు. ప్రభుత్వ చర్యల పట్ల కృతజ్ఞతలు తెలియజేస్తూ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణం వద్ద ఉద్యోగులు తమ వాహనాల ముందు థేంక్యూ సీఎం సార్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో 108 ఉద్యోగులు మహేష్, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *