భారత వైమానిక దళం సంచలన నిర్ణయం తీసుకుంది. వరుస ప్రమాదాల నేపథ్యంలో తమ వద్ద ఉన్న సుమారు 30 సింగిల్ సీట్ తేజస్ యుద్ధవిమానాలను తాత్కాలికంగా నిలిపివేసింది.
ఈ నెల ప్రారంభంలో ఓ కీలక ఎయిర్ బేస్‌లో సాధారణ శిక్షణ ఫ్లైట్ ముగించుకుని ల్యాండింగ్ సమయంలో Indian Air Force కు చెందిన HAL Tejas లైట్ కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ మరోసారి ప్రమాదానికి గురైంది.
ప్రాథమిక సమాచారం ప్రకారం సాంకేతిక లోపమే కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు.
ముఖ్యంగా ఆన్‌బోర్డ్ సిస్టమ్ ఫెయిల్యూర్ జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తమవుతోంది.
ప్రమాదంలో విమానం తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ పైలట్ సురక్షితంగా పారాచూట్ సహాయంతో బయటకు దూకి ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.
97 మల్టీ రోల్ తేజస్ Mk-1A యుద్ధవిమానాల కొనుగోలుకు భారీ ఒప్పందం
ఈ ఘటనపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన విడుదల కాలేదు. అయితే పూర్తి స్థాయి సాంకేతిక దర్యాప్తు చేపట్టినట్టు సమాచారం. రెండేళ్లలో మూడోసారి తేజస్ క్రాష్ కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
2024 మార్చిలో రాజస్థాన్‌లోని జైసల్మేర్ సమీపంలో మొదటి ప్రమాదం చోటుచేసుకోగా, 2025 నవంబర్‌లో జరిగిన దుబాయ్ ఎయిర్ షో లో రెండో ప్రమాదంలో వింగ్ కమాండర్ నమంశ్ స్యాల్ మృతి చెందారు.
ఈ వరుస ఘటనలు ఆందోళన కలిగిస్తున్నప్పటికీ తేజస్ Mk1A ప్రోగ్రామ్‌పై భారత వైమానిక దళం నమ్మకం కొనసాగిస్తోంది.ఇప్పటికే 97 మల్టీ రోల్ తేజస్ Mk-1A యుద్ధవిమానాల కొనుగోలుకు భారీ ఒప్పందం కుదిరింది.ఇవి వైమానిక రక్షణ, సముద్ర గస్తీ, దాడి మిషన్లలో కీలక పాత్ర పోషించనున్నాయి.
The post తేజస్‌కు మళ్లీ ప్రమాదం.. ఐఏఎఫ్ షాకింగ్ నిర్ణయం! appeared first on Visalaandhra.


