తెలంగాణ చట్టసభల్లో విప్‌ల నియామకం – Visalaandhra


హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. శాసనసభ, శాసనమండలి రెండింటిలోనూ సమన్వయం కోసం ప్రభుత్వ విప్‌లను నియమిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామ కృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. అసెంబ్లీలో ప్రభుత్వం తరఫున గొంతుక వినిపించేందుకు, ఎమ్మెల్యే లను ఏకం చేసేందుకు ముగ్గురు సీనియర్ నాయకులను విప్‌లుగా రేవంత్‌రెడ్డి సర్కార్ నియమించింది. వీరిలో వేముల వీరేశం (నకిరేకల్), విజయ రమణారావు (పెద్దపల్లి), యెన్నం శ్రీనివాస్‌రెడ్డి (మహబూబ్ నగర్) ఉన్నారు. శాసనమండలిలో ప్రభుత్వ పక్షాన సభ్యులను సమన్వయం చేసేందుకు ఇద్దరు ఎమ్మెల్సీలకు బాధ్యతలు అప్పగించింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *