డ్రగ్స్ జోలికి పోవద్దు


సైబర్ నేరాలు పట్ల అప్రమత్తంగా ఉండాలి : సి ఐ సురేష్

భాష్యం లో అవగాహన సదస్సు

విశాలాంధ్ర – మండపేట : యువత ముఖ్యంగా విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిస కావద్దని టౌన్ సి ఐ సురేష్ అన్నారు. స్థానిక భాష్యం స్కూల్ లో మంగళవారం సి ఐ సురేష్ ఆధ్వర్యంలో డ్రగ్స్ వద్దు బ్రో రేపటి తరం కోసం గంజాయి రహిత సమాజం ఇదే మా సంకల్పం పేరిట అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంజాయి, గుట్కా, సిగరెట్, డ్రగ్స్ వంటివి హాని చేస్తాయని జీవితం నాశనమౌతుందన్నారు. ఎట్టి పరిస్థితుల్లో వీటి జోలికి పోవద్దని సూచించారు. ఇటీవల సైబర్ క్రైమ్ విపరీతంగా పెరిగిందని యువత అప్రమత్తంగా ఉండాలని కోరారు. పోక్సో చట్టంను వివరిస్తూ బాలికలు, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే చట్టాలు కఠినంగా ఉన్నాయన్నారు. మహిళల ను గౌరవించాలని వారికి కష్టం నష్టం కలిగే ఎలాంటి చర్యలకు పాల్పడవద్దవి సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

The post డ్రగ్స్ జోలికి పోవద్దు appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *