వాషింగ్టన్: తన చైనా పర్యటనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాయిదా వేసుకున్నారు. సుమారు నెలన్నర రోజులు పాటు ఈ పర్యటన వాయిదా పడింది. ఇదే విషయాన్ని ట్రంప్ అధికారికంగా ప్రకటించారు. ‘చైనా పర్యటనను నెలన్నర రోజులు వాయిదా వేసుకున్నా. ఇది ఖరారైంది కానీ, చైనాలో పర్యటించాలని ఎదురు చూస్తున్నా’ అని ఓవల్ కార్యాలయంలో ట్రంప్ వెల్లడించారు.ఇరాన్ చమురు క్షేత్రాలపై దాడులు వద్దని ఇజ్రాయిల్‌కు సూచించినట్లు ఆయన తెలిపారు. ‘మా దేశాలకు సమన్వయం కుదిరింది కానీ ఇజ్రాయిల్ ఒక్కోసారి సొంతంగా చర్యలు తీసుకోవడం నాకు నచ్చదు. ఇకపై అలాంటివి ఆపేస్తున్నాం’ అని ట్రంప్ వెల్లడించారు. అయితే, ఇరాన్‌తో ఇజ్రాయిల్‌కు, మొత్తం ప్రపంచానికి ముప్ప్పు ఉందని గత 40 ఏళ్లుగా చెబుతున్నది నిజమేనని, ట్రంప్ కూడా ఇదే మాట అన్నారని జెరూసలేంలో మీడియాతో మాట్లాడిన బెంజమిన్ నెతన్యాహు తెలిపారు.


